ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కామ పిశాచి: సింగర్ చిన్మయి మరో సంచలనం!
Recommended Video

#మీటూ ఉద్యమంలో భాగంగా తనకు ఎదురైన సెక్సువల్ మరాస్మెంట్ గురించి వెల్లడించిన సింగర్ చిన్మయి.... తనలాగా బయటకు వచ్చి ధైర్యం చేయలేని వారి తరుపున పోరాడుతోంది. వారి నుండి వివరాలు సేకరించిన తన ట్విట్టర్ ద్వారా ప్రిడేటర్స్ పేర్లు బయటకు పెడుతూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ తమిళ రచయిత, జాతీయ అవార్డ్ విన్నర్ వైరముత్తు సెక్సువల్ హరాస్మెంట్ గురించి బయట పెట్టిన చిన్మయి.... తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్, మ్యూజిషియన్ ఓఎస్ త్యాగరాజన్ వల్ల తన సహచర సింగర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయట పెట్టారు.
మ్యూజీషియన్ ఓఎస్ త్యాగరాజన్ వెకిలి వేషాలు
మ్యూజీషియన్ ఓఎస్ త్యాగరాజన్ వల్ల తన సహచర సింగర్ ఎదుర్కొన్న వేధింపుల గురించి చిన్మయి వెల్లడించారు. అయితే తన కొలీగ్ పేరు బయట పెట్టకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటిక్ మ్యూజిషియన్ ఓఎస్ త్యాగరాజన్ 11వ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడి వద్ద నేర్చుకోవడం మానేసింది' అని చిన్మయి తెలిపారు.

సంగీత పేరుతో అసభ్యంగా
అక్కా నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు ఇదంతా చేస్తున్నందుకు థాంక్స్. నేను 11వ తరగతి చదువుతున్నపుడు ఓఎస్ త్యాగరాజన్ క్లాసుకు వెళ్లాను. నాకు సంగీతంలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. ఒక మ్యూజిషియన్ రికమండేషన్‌తో ఆయన వద్ద చేరాను. అపుడు అతడు సంగీతం నేర్పే పేరుతో అసభ్యంగా ప్రవర్తించాడు అని... తన గోడుకును ఆమె చిన్మయితో చెప్పుకొన్నారు.

రఘు దీక్షిత్ సెక్సువల్ సెక్సువల్ హరాస్మెంట్
సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ తన స్నేహితురాలు, కో సింగర్‌తో ఎంత నీచంగా ప్రవర్తించాడో, అతడి సెక్సువల్ హరాస్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో చిన్మయి బట్ట బయలు చేశారు. అతడో పెద్ద కామ పిశాచి అని చెప్పే ప్రయత్నం చేశారు.
ముద్దు పెట్టమని అడిగాడు
రఘు దీక్షిత్ గురించి తన కొలీగ్ చెప్పిన వివరాలను చిన్మయి పోస్ట్ చేశారు. ‘ఓసారి సాంగ్ రికార్డింగ్ పూర్తయిన తర్వాత చెక్ ఇచ్చే సమయంలో నన్ను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టమని అడిగాడు. ఇంకా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడు చేసిన పనికి నుండి ఏడుస్తూ వెళ్లిపోయాను. అయితే నేను నా పేరు బయట పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాను' అని చిన్మయి కొలీగ్ రఘు దీక్షిత్ మీద ఆరోపణలు చేశారు.
మీడియా తీరుపై చిన్మయి
తమిళ మీడియా తీరుపై చిన్మయి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. వైరముత్తు గురించి నేను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఢిల్లీ మీడియా కవరేజ్ తర్వాత బైట్ కావాలంటూ వస్తున్నారని మండి పడ్డారు.


Click it and Unblock the Notifications











