లైంగిక వేధింపులు: ఆ స్క్రీన్ షాట్లు నిజమే, తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పిన రచయిత!

#మీటూ ఉద్యమం ఇండియాలోనూ ఉధృతం అవుతోంది. #మీటూ కాంపెయిన్లో భాగస్వాములు అవుతున్న పలువురు నటీమనులు, ఇతర రంగాలకు చెందిన మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనల గురించి బయట పెడుతున్నారు. ఈ క్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడిన పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రముఖ సినీ, నవలా రచయిత చేత భగత్ కూడా ఈ కోవకు చెందిన వాడే అని తేలిపోయింది. ఓ మహిళతో అతడు సభ్యంగా ప్రవర్తించిన తీరు సాక్ష్యాలతో సహా బట్టబయలయ్యాయి. అయితే వెంటనే వెంటనే తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పడం గమనార్హం.

 వాట్సాప్‌లో స్క్రీన్ షాట్లు బట్టబయలు

వాట్సాప్‌లో స్క్రీన్ షాట్లు బట్టబయలు

ఓ మహిళతో చేతన్ భగత్ అసభ్య పదజాలంలో వాట్సాప్ చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు బయట్టబయలయ్యాయి. ఓ మహిళా జర్నలిస్ట్ వీటిని షేర్ చేశారు. ఈ స్క్రీన్ షాట్ల విషయంలో చేతన్ భగత్ వెంటనే రియాక్ట్ అయ్యారు.

ఆ స్క్రీన్ షాట్లు నిజమే, క్షమాపణలు చెబుతున్నా

ఆ స్క్రీన్ షాట్లు నిజమే, క్షమాపణలు చెబుతున్నా

ఈ స్క్రీన్ షాట్లు నిజమే. అందులో నేను చేసిన వ్యఖ్యలపై చింతిస్తున్నాను.ఈ సందర్భంగా ఆమెకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మీరు నా క్షమాపణలు స్వీకరిస్తారని భావిస్తున్నాను. నేను ఇలాంటి పని చేసినందుకు నా భార్య అనూషను కూడా క్షమాపణ అడుగుతున్నట్లు చేతన్ భగత్ పేర్కొన్నారు.

వివాహేతర సంబంధం లేదు, బూతు బొమ్మలు పంపలేదు

వివాహేతర సంబంధం లేదు, బూతు బొమ్మలు పంపలేదు

అయితే నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.ఆమె నాకు తెలిసిన అమ్మాయే. చాలా సార్లు కలిశాం. నా భార్యతో గ్యాప్ వచ్చినపుడు మెంటల్‌గా ఇద్దరం కనెక్ట్ అయ్యాం. అయితే మా మధ్య ఫిజికల్ రిలేషన్‌షిప్ లేదు. బూతు ఫోటోలు పంపుకోవడం, బూతు పదజాలం వాటం లాంటివి చేయలేదని చేతన్ భగత్ స్పష్టం చేశారు.

 బాలీవుడ్లో మొత్తం ఇదే చర్చ

బాలీవుడ్లో మొత్తం ఇదే చర్చ

బాలీవుడ్ మీడియాలో కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తనుశ్రీ దత్తా -నానా పాటేకర్ ఇష్యూ తర్వాత #మీటూ కాంపెయిన్ మరింత ముమ్మరం అయింది. తాజాగా చేతన్ భగత్ కూడా అలాంటి చెత్త వ్యక్తుల్లో ఒకరని తేలడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.

 ఎన్నో నీతి సందేశాలిచ్చి... ఇపుడు నీతి తప్పాడు

ఎన్నో నీతి సందేశాలిచ్చి... ఇపుడు నీతి తప్పాడు

చేతన్ భగత్ రాసిన పలు నవలలు పాపులర్ అయ్యాయి. కొన్ని సినిమాలుగా రూపు దిద్దుకున్నాయి. తన రచనల్లో ఎన్నో నీతి సందేశాలిచ్చిన చేతన్ భగత్ నీతి మాలిన పని చేయడం ద్వారా తన పురువు పోగొట్టుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X