'బలాదూర్' వర్కవుట్ కానందుకు అనూష్క ఏమీ అప్ సెట్ కావటం లేదట.జయాపజయాలు సినీ కెరీర్ లో కామన్ అని ఆమె లైట్ గా తీసుకుందిట.అయితే మరెందుకు ఈ నీరసం వార్తలు వస్తున్నాయి అంటే ఆమె తనపై వస్తున్న రూమర్స్ కి అప్ సెట్ అయిందని తెలుస్తోంది.అయినా ప్రస్తుతం అనూష్క సీజన్ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. దాంతో క్రేజ్ ఉన్న ఆమెపై రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది హీరో గోపిచంద్ తో ఆమె ప్రేమయణం నడుపుతోందని,త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతోందని అంటున్నారు. వీటిల్లో నిజానిజాలు ఎలా ఉన్నా ఆమె మాత్రం వీటిని ఇష్టపడటం లేదని,మీడియా అంటే చిరాకు పడుతోందని తెలుస్తోంది.ఇంటర్వూలు కోసం ఎవరైనా జర్నలిస్టులు ఎప్రోచ్ అవుతున్నా అపాయింట్ మెంట్ ఇవ్వటానికి చాలా ఆలోచిస్తోందని చెప్తున్నారు. అంతేగాక తన పర్శనల్ లైఫ్ ని టచ్ చేయద్దని రిక్వస్ట్ చేస్తోందిట. అయితే పేరున్న వారిపై ఇలా రూమర్స్ రావటం సహజమేనని,దానికంత కంగారుపడాల్సిన పనేం లేదని సీనియర్స్ సలహాలిస్తున్నారు.