పవన్ పైనే ఆశలు పెట్టుకున్న సెక్సీ, బ్యూటీ హీరోయిన్...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్ సింగ్". సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రూపొందిన సూపర్ హిట్ మూవీ 'దబాంగ్" రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
బాలీవుడ్ లో వెలిగిపోదామనుకుని వెళ్ళిన శృతిహాసన్ కు అక్కడ చుక్క ఎదురవడంతో తన సొంత గడ్డ అయిన సౌత్ లో అయినా స్టార్ అయిపోదామనుకుంది. అయితే కాలం కలిసిరావడం లేదు. శృతిహాసన్ చేసిన సినిమాలు పెద్ద హిట్ అవ్వకపోవడంతో ఎం చేయాలో దిక్కు తోచని పరిస్తితుల్లో ఉంది. సూర్య సెవెంత్ సెన్స్ సినిమాతో తనకు తమిళ్ లో తిరుగుండదు అనుకుంది, అయితే సెవెంత్ సెన్స్ కు పెద్దగా ఆదరణ దొరకకపోవడంతో అక్కడా టాప్ హీరోయిన్ కాలేకపోయింది.
పోనీ తెలుగులోనయినా ఓ మై ఫ్రెండ్ తో మంచి హిట్ కొట్టవచ్చు అనుకుంది, కానీ ఓ మై ఫ్రెండ్ కూడా మిక్స్ డ్ రివ్యూస్ నే అందుకుంటుంది. అటు తమిళ్, ఇటు తెలుగులో రాజ్యమేలేద్దామనుకున్న శృతి ఇప్పుడు ఆలోచనలో పడింది. పూర్తిగా హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయి తెలుగు సినిమాలకే డెడికేషన్ చూపించాలనే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం హిందీ సూపర్ హిట్ మూవి దబాంగ్ కు తెలుగు రీమేక్ అయిన గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన శృతి నటిస్తుంది. ఈ సినిమాతో అయినా అమ్మడికి హిట్ దొరుకుతుందనే ఆశలతో ఉంది.


Click it and Unblock the Notifications











