హన్సిక...చివరకు జయమాలినిలా

అయితే పాత భిళ్ళాని అజిత్ తో తమిళ్ లో మళ్ళీ రీమేక్ చేసారు. డాన్ సినిమాని స్క్రీన్ ప్లే,క్లైమాక్స్ మార్చి షారూఖ్ తో డాన్ మళ్ళీ చేసారు. అందులో కరీనా చేసిన 'యే మేరా దిల్ ...దిల్ కా దీవానా' (పాత డాన్ లో హెలెన్ చేసింది) సాంగ్ ప్లేస్ మెంటే హన్సిక చేయబోయేది. ఆ సన్నివేశ సాంగ్ ని తమిళ్ లో నమిత చేసింది. ఇప్పుడా రైట్స్ తీసుకుని ఈ చిత్రాన్ని రమేష్ రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అందులో నయనతార చేసిన బికినీ సన్నివేశాన్ని అనూష్క కోటి రూపాయలకు పుచ్చుకుని చేస్తోంది. కృష్ణ రాజు తమ గోపీకృష్ణ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.హన్సిక ప్రస్తుతం బి.గోపాల్ దర్శకత్వంలో రామ్ హీరోగా రెడీ అవుతున్న మస్కా చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత ఎమ్.ఎస్.రాజు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











