నాగ్ కోరికను నయనతార క్యాష్ చేసుకుంటుందా?

సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాల దర్శకడు దశరథ్ నాగార్జున-నయనతార జంటగా సినిమా ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాత శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నట్లు చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం నాగార్జున ఢమరుకం చిత్రంలో నటిస్తున్నాడు. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రం తర్వలో విడుదల కానుంది. మరో వైపు నాగార్జున షిరిడి సాయిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది.


Click it and Unblock the Notifications











