నా కూతుర్ని విడిచి ఉండలేను..ఇలియానా
నా కూతురు చాలా క్యూట్ గా ఉంటుంది. దానికి దాదాపుగా నేనే స్నానం చేయిస్తూంటాను..స్కూలుకి రెడీ చేస్తూంటాను..బ్రేక్ పాస్ట్ రెడీ చేస్తాను..బట్టలు వేస్తూంటాను..అది లేకుండా దాన్ని పలకరించకుండా నేను ఉండలేను..అని చెప్పి ఇలియానా షాక్ ఇచ్చింది. లేటెస్ట్ గా ఓ లీడింగ్ పత్రిక వారు ఆమెను పెళ్ళి, పిల్లలు గురించి అడిగితే ఇలా చెప్పింది. అదేంటి మీకు పెళ్ళి కాలేదు కదా..పిల్లలు అంటున్నారు అన్నారు కాస్సేపటికి నోరు తెరుచుకుని..అప్పుడు రివిల్ చేసిందామె తన కూతురు అంటే తన అక్క ఫరా కూతురు అని అని. చిన్నప్పటి నుంచి ఆ చిన్నారికి తన వద్దే ఎక్కువ చనువు అని,తనకూ ఆమె అంటే ప్రాణమని చెప్పుకొచ్చింది. అదీ కూతరు ట్విస్ట్. ఆమె చేసిన లేటెస్ట్ చిత్రం సలీం భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఆమె విక్రమ్ సరసన 13 బి దర్శకుడి డైరక్షన్ లో ఓ చిత్రం కమిటయింది. తెలుగులోనూ ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్నారు. మున్నాలోనూ ఆమె ప్రభాస్ కి జంటగా చేసింది.


Click it and Unblock the Notifications











