'ఫులి' ఆడియో ఫంక్షన్ తో శ్రియ ప్లాన్ సక్సెస్ అవుతుందా...!?
కొమరం పులి ఆడియో ఫంక్షన్ లో ఈ చిత్రంలో ఒక పాటలో నర్తించిన శ్రియ హాజరైన విషయం తెలిసిందే అయితే అమ్మడు ఎంత హాట్ గా కనిపించిందంటే కుర్రకారు గుండెల్ని పిండేసింది. అయితే శ్రియ ఈ ఫంక్షన్ కి హాజరవ్వడం వెనుక పెద్ద విషయమే ఉందట. బాలీవుడ్ లో బంతిలా ఆడుకుంటే మళ్ళీ టాలీవుడ్ లో వచ్చి పడ్డ శ్రియ..ఇక్కడ అవకాశాల కోసం పిచ్చపిచ్చగా ప్రయత్నించిన విషయం తెలిసిందే..
అయితే అంతకు ముందు బాలులో పవన్ సరసన చేసిన శ్రియకి మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉండటంతో పవన్ తన చిత్రంలో ఓ పాటకి చాన్న్ ఇచ్చినట్లుగా సమాచారం. పవన్ సరసన ఓ పాటలో నర్తించడానికి ఓప్పుకుని హైలెట్ అయిన శ్రియకు వెంటనే రవితేజ సరసన డాన్ శ్రీను లో నటించే అవకాశం వచ్చింది..అయితే ఆ చిత్రం మరో చిత్రం ఆమెకు రాలేదు. పవన్ కళ్యాణ్ ఫంక్షన్ అంటే చిత్ర పరిశ్రమ మొత్తం చూస్తుంది కాబట్టి ఇక్కడా కొంచెం హాట్ గా కనిపించి పరిశ్రమ కళ్లలో పడాలనే శ్రియ ఈ ఆడియోకి హాజరైనట్టుగా..అలాగే చిన్న గౌనులో వచ్చి స్టేజి మీద తళ్ళుక్కున మెరిసి దర్శక నిర్మాతల దృష్టిలో పడేలా చేసుకుంది. అయితే ఆమె అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే మరి కొద్దిరోజుల్లో శ్రియ రెండు మూడు సినిమాలలో బుక్ అయింది అనే వార్తలు రావచ్చు.


Click it and Unblock the Notifications











