twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రొమాన్స్‌' చిత్రం ఆపాలంటూ ఆందోళన,పోస్టర్లు దగ్ధం

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన రొమాన్స్‌ అనే చిత్రంలో అశ్లీలమైన భాష వాడారని, అసభ్య సంభాషణలను తొలగించకపోతే వూరుకునేది లేదని పలువురు ఆందోళనకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఈ సినిమా ఆడుతున్న థియేటర్‌ వద్ద సినిమా ఫ్లెక్సీలను, పోస్టర్లను తొలగించి దగ్ధం చేశారు. చిత్రాన్ని యథాతథంగా కొనసాగిస్తే వూరుకోమని హెచ్చరించారు. యువతరాన్ని పక్కదారిపట్టించే విధంగా 'రొమాన్స్‌' సినిమాలో ద్వంద్వార్థాలతో కూడిన పదజాలాన్ని ఉపయోగించారని, టైటిల్‌లోనే అశ్లీలత ఉందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు టి.జ్యోతి విమర్శించారు.

    ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ ఎదుట ధర్నా నిర్వహించి, 'రొమాన్స్‌' పోస్టర్లను దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలో యువత పక్కదారి పట్టడానికి, ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరగడానికి అశ్లీల సినిమాల ప్రభావమే ఎక్కువగా ఉందన్నారు. అశ్లీలతతో సొమ్ము చేసుకోవాలనుకునే దర్శక నిర్మాతలు కూడా సమాజంలో అంతర్భాగమనే విషయాన్ని మరచిపోయి ప్రవర్తించడం ఆందోళనకరమన్నారు.

    సెన్సార్‌ బోర్డు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. 'రొమాన్స్‌' సినిమా డైరెక్టర్‌ మారుతికి డబ్బు యావ తప్ప విద్యార్థులు, యువకుల భవిష్యత్‌ పట్టడం లేదని విమర్శించారు. ఇంతకు ముందు 'బస్‌స్టాప్‌' సినిమా తీసి విద్యార్థినుల మనోభావాలు దెబ్బతీశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా 'రొమాన్స్‌' సినిమా నిలుపుదల చేయాలని, లేదంటే సెన్సార్‌ బోర్డు ముందు ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆశాలత, ఇందిర, నగర అధ్యక్షులు శశికళ, ఎస్‌ఎఫ్‌ఐ నగర ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వర్‌రావు, ఉపాధ్యక్షులు గణేష్‌, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎ.విజరు తదితరులు పాల్గొన్నారు.

    English summary
    
 SFI demands Stop Telugu film titled Romance . "Romance" comes from the factory of filmmaker Maruti, who kicked off a trend with low-budget flicks such as "Ee Rojullo" and "Bus Stop", made strictly for the college-goers. His films mostly revolve around college love story, sex, betrayal and some cheap humour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X