»   » జై పవన్ కళ్యాణ్: ‘సర్దార్’ ట్రైలర్‌పై కామెంట్స్!

జై పవన్ కళ్యాణ్: ‘సర్దార్’ ట్రైలర్‌పై కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ తర్వాత మరోసారి వర్మ తన ట్విట్టర్‌కు పని చెప్పారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి స్పీచ్ పై తనదైన రీతిలో స్పందించారు. అదే విధంగా సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ పై కామెంట్ చేసారు. అన్నదమ్ముల అనుబంధం పవర్ ఫుల్ గా వర్కౌట్ అవుతుందని అభిప్రాయ పడ్డారు.

సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ బ్యాడర్ దన్ బెస్ట్...వర్సెర్ దన్ ఫెంటాస్టిక్...ఎక్స్‌ట్రార్డినర్లీ ఆర్డినరీ ఇన్ కంటెక్ట్స్ బట్ సూపెర్లేటివెల్లీ ట్రెమండస్ ఇన్ ఇంటెంట్....జై పికె(పవన్ కళ్యాణ్) అంటూ ట్వీట్ చేసారు. వర్మ చేసిన ట్వీట్స్ స్లైడ్ షోలో...పై మీరూ ఓ లుక్కేయండి.


సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్


హిందీలో రిలీజ్ చేయడంపై వర్మ అసంతృప్తి...
పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే హిందీ రిలీజ్ వల్ల పవన్ కళ్యాణ్ కు ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.


'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీ బాక్సాఫీసు వసూళ్లు..... పవన్ కళ్యాణ్ కంటే ప్రభాసే పెద్ద స్టార్ అని నేషనల్ లెవల్లో నిరూపిస్తుందంటూ వర్మ అభిప్రాయ పడ్డారు. బాహుబలి లాంటి విజువల్ వండర్స్ లేకుండా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడం పెద్ద బ్లండర్ అంటున్నారు వర్మ.


ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్


ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు బ్యాడ్ చేస్తుందని....నేషనల్ ప్రేక్షకుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ కంటే చిన్నా హీరోగా కనిపిస్తాడని వర్మ ఆందోళన వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి హిమాలయన్ మిస్టేక్ చేయవద్దని నా అడ్వైజ్ అంటూ వర్మ ట్వీట్ చేసారు.


బాహుబలి లాంటి పెద్ద సినిమా చేసినపుడే పవన్ కళ్యాణ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తే బావుంటుంది. అలాంటిదేమీ లేకుండా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం పవన్ కళ్యాన్ కు మైనస్సే.....బాహుబలి ముందు సర్దార్ గబ్బర్ సింగ్ చాలా చిన్నగా కనిపిస్తుంది అంటూ వర్మ ట్వీట్ చేసారు.


సర్దార్ ట్రైలర్ పై ట్వీట్

సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ పై వర్మ ట్వీట్ ఇలా...


అన్నదమ్ముల అనుబంధంపై..

పవన్ కళ్యాణ్, చిరంజీవి....అన్నదమ్ముల అనుబంధంపై వర్మ ట్వీట్


హిందీలో..

హిందీ రిలీజ్ చేయడం నష్టం అంటూ వర్మ ట్వీట్


పవన్, ప్రభాస్

పవన్ కంటే ప్రభాస్ పెద్ద స్టార్ అని అనుకుంటారు...


English summary
‘SGS trailer is badder than best,worser then fantastic,extraordinarily ordinary in context but superlatively tremendous in intent ..Jai P K" RGV Tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu