షబానా ఆజ్మీకి న్యూయార్క్‌లో ఘన సన్మానం
సినిమా రంగంలో విశిష్ట సేవలకు గాను, న్యూయార్క్ చిత్ర పరిశ్రమ అభ్యున్నతికి ముఖ్య పాత్రను పోషించినందుకు గాను బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి న్యూయార్క్‌లో ధన సన్మానం జరిగింది. దీంతో న్యూయార్క్‌లో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతయ నటిగా రికార్డుని సృష్టించారు. శుక్రవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో 'ప్రొక్లమేషన్ బై ద సిటీ ఆఫ్ న్యూయార్క్' పేరుతో షబానాకు ప్రశంసాపత్రం అందజేశారు.
ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్(ఐఏఏసీ)లో సభ్యురాలిగా పనిచేస్తూ.. భారతీయ చిత్రాలకు న్యూయార్క్‌లో విశేష ఆదరణ లభించేందుకు షబానా అజ్మీ కృషిచేశారని వారు పేర్కొన్నారు. ఐఏఏసీ ఏర్పాటుచేసిన న్యూయార్క్ ఇండియన్ ఫెస్టివల్‌కు 2000లో షబానా సలహాబోర్డు సభ్యురాలిగా పనిచేశారు. భారత్ చిత్రాలతోపాటు, ఉపఖండానికి చెందిన లఘుచిత్రాలు, సినిమాలు అక్కడ ప్రదర్శించబడడంలో ముఖ్య పాత్రను పోషించారు.


Click it and Unblock the Notifications











