పాకిస్థాన్ ప్రధాని మా నాన్నకు పెద్ద ఫ్యాన్...అంటూ ట్వీట్
ముంబై: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మోడీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులను కలిసారు. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీని కూడా ఆయన కలిసారు.
నవాజ్ షరీఫ్‌ను కలిసిన విషయాన్ని షబానా అజ్మీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ఏర్పాటు చేసిన విందులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కలుసుకున్నారు. తన తండ్రి కైపీ అజ్మీకి ఆయన పెద్ద ఫ్యాన్...ఈ విషయం ఆయన స్వయం చెప్పారు. మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ లంటే కూడా ఇష్టమని చెప్పారని షబానా అజ్మీ ట్వీట్ చేసారు.

ఈ సమావేశంలో ఆమె నవాజ్ షరీప్‌తో సినిమా రంగానికి సంబంధించిన విషయాలు కూడా చర్చించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడానికి నవాజ్ షరీఫ్ తన వంతు సాయం చేస్తానని తెలిపారు. ఇందులో భాగంగా భారత్-పాక్ సంయుక్తంగా సినిమాలు నిర్మించే అంశానికి తన ఫుల్ సపోర్టు ఇస్తానన్నారు అని షబానా అజ్మీ ట్వీట్ చేసారు.
సనిమా రంగానికి సంబంధించి కలిసి పని చేయడం అనేది ఇరు దేశాల మధ్య సినిమా రంగంలో పోటీని పెంచడానికి కాకుండా.....ఇదరు దేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనడానికి సహకరిస్తుందని తాను భావిస్తున్నట్లు షబానా అజ్మీ తెలిపారు. శాంతి సౌబ్రాతృత్వం నెలకొనాలని ఆమె ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











