నిఘా నీడలో వెంకీ ‘షాడో’
హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'షాడో' చిత్రం ఆడియో రేపు(మార్చి 15) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ మేకర్స్ ఈ ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించడం ద్వారా సినిమాపై భారీగా అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా..ఇటీవల దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుగనున్న శిల్పకళా వేదిక ప్రాంతంపై నిఘా వర్గాల కన్నేసి ఉంచాయి. ఆడియో వేడుక వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అందరినీ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోని పంపించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసారు.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











