వెంకటేష్ ‘షాడో’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'షాడో' చిత్రం ఆడియో మార్చి 15న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. తాజాగా ఈచిత్రం ఆడియోకు సంబంధించిన ట్రాక్ లిస్టు బయకటు వచ్చింది. ఇందులో ఏయే పాటలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
సాంగ్స్ ట్రాక్ లిస్ట్
1. షాడో టైటిల్ సాంగ్
2. గోల గోల
3. పిల్లా మంచి బందోబస్తు
4. నాటీ గర్ల్
5. ఐతలకా...
6. రివేంజ్ ఆఫ్ షాడో
ఈ పాటల్లో బాబా సెహగల్ పాడిన షాడో టైటిల్ సాంగును ఈ రోజు విడుదల చేయనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వెంకీతో పాటు ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











