వెంకటేష్ ‘షాడో’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ పొందినట్లు దర్శకుడు మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా ఫ్యామిలీ అంతా కలిసి ఆనందించేలా బాగుందని, సమ్మర్ హిట్‌గా నిలుస్తుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రశంసించినట్లు తెలిపారు.
షాడో చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందించారు.
ఏప్రిల్ 26న ఈచిత్రం గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఇందులోని నాటీగర్ల్స్ అనే సాంగులో గీతా మాధురి తొలిసారి వెండితెరపై కనిపించబోతోంది. ఆమె మైక్ పట్టుకుని పాట పాడుతుంటే హీరోయిన్ తాప్సీ హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











