వెంకటేష్ ‘షాడో’టీజర్‌కు గుడ్ రెస్పాన్స్
హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ తర్వాతి సినిమా 'షాడో' మూవీ టీజర్ విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో వెంకీ డాన్ పాత్ర పోషిస్తున్నారు. కంత్రి, బిల్లా, శక్తి చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని వెంకీ ఈచిత్రం తనకు పూర్వ వైభవం తెస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
సక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవల ఇక్కడ గణేష్ ఉత్సవాలపై పాట చిత్రీకరణ జరిపారు.
ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











