twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ ‘షాడో’ ఫస్ట్ టీజర్ సెప్టెంబర్ 19న

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'షాడో'. వెంకీ ఇందులో డాన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను సెప్టెంబర్ 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ వారంలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరో వెంకటేష్, హీరోయిన్ తాప్సీలతో యాక్షన్ సన్నివేశాలు మరియు టాకీ పార్టు చిత్రీకరించనున్నారు.

    యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది. సక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    The first teaser of 'Victory' Venkatesh's action entertainer Shadow will be released on September 19. The fresh schedule of 'Shadow' will begin from September 15 in and around Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X