ఇంటర్నేషనల్ రేంజికి హీరో వెంకటేష్!
విక్టరీ వెంకటేష్ తొలి సారిగా ఇంటర్నేషనల్ రేంజిలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం వెంకీ మెహర్ రమేష్ దర్శకత్వంలో 'షాడో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్ ఇంటర్నేషనల్ డాన్‌గా కనిపిస్తారు. వెంకీ సరసన తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం 'షాడో' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వెంకీ, తాప్సీలపై పాటల చిత్రీకరణ జరుపుతున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని..యునైటెడ్ మూవీస్ పతాకం సింహా చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మాత. ఇటీవల షాడో యూనిట్ విదేశాల్లో షూటింగు జరుపుకుని తిరిగి వచ్చింది.
'షాడో' చిత్రం మాఫియా నేపథ్యం ఉంటుందని, వెంకీ ఇందులో డాన్ పాత్రలో దర్శనం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ టచ్ కూడా మెండుగా ఉంటుందని అంటున్నారు ఈచిత్రానికి రచయితగా పని చేస్తున్న కోన వెంకట్. సినిమా పేరుకు తగిన విధంగానే మాఫియా బ్యాగ్రౌండ్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఫన్నీగా ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. జర్నీ ఫేం అంజలి అతని భార్యగా నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు కూడా మరో హీరోగా చేస్తున్నాడు. దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











