twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘షాడో’లో మాఫియాలేదు, నేను డాన్ కాదు : వెంకటేష్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ తాజా సినిమా 'షాడో'పై చాలా కాలం నుంచి ఓ వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం మాఫియా నేపథ్యంలో రూపొందుతోంది, ఇందులో వెంకటేష్ మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్నారని ఆ వార్తల సారాంశం. మీడియాలో ఇంత కాలం ఈ నుంచి విషయం ప్రచారం జరుగుతున్నా దర్శక నిర్మాతలు స్పందించలేదు.

    అయితే తాజాగా హీరో వెంకటేష్ ఈ వార్తలను ఖండించారు. ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ 'షాడో' సినిమాలో మాఫియా బ్యాక్ డ్రాప్ లేదని, ఇందులో తాను డాన్ పాత్ర చేయడం లేదని స్పష్టం చేసారు. ఇదే రివేంజ్ డ్రామా అని, ఈ సినిమా కామోడీ, యాక్షన్, సెంటిమెంట్ లాంటి అంశాలు కలగలిపి రూపొందించిన స్టైలిష్ ఎంటర్ టైనర్ అని చెప్పుకొచ్చారు. తనది ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించే సాధారణ వ్యక్తి పాత్ర అని తెలిపారు.

    మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.

    నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌. మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌, సంగీతం: తమన్‌. కెమెరా: ప్రసాద్‌, మూరెళ్ల, ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌. ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.

    English summary
    Victory Venkatesh's stylish look in his upcoming movie Shadow has created lot of curiosity about its story. It was rumoured earlier that the Telugu actor is playing a don in the film, which has the mafia backdrop. But Venky has slammed the reports stating that they are just baseless rumours and his next outing is a stylish action entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X