‘షాడో’లో వెంకటేష్ పంచ్ డైలాగ్
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ త్వరలో 'షాడో' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో కూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో వెంటేష్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ అక్టోబర్ 1న విడుదల కాబోతోంది.
ఈ చిత్రంలో వెంకటేష్ నోట అదిరిపోయే పంచ్ డైలాగులు వినిపించనున్నాయి. అక్టబర్ 1న విడుదల కానున్న టీజర్లో... 'నేను ఎవరనేది మిస్టరీ... నేను క్రియేట్ చేసేది హిస్టరీ.... అడుగేస్తే విక్టరీ' లాంటి పంచ్ డాలాగ్స్ అభిమానులను అలరించనున్నాయి. పలు విజయవంతమైన చిత్రాలకు పని చేసిన కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన, వినోదాత్మకమైన స్ర్కిప్టు రూపొందిస్తున్నారు.
వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ.


Click it and Unblock the Notifications











