‘షాడో’ టైటిల్ సాంగ్ రిలీజ్ (ఫోటోలు)
హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' చిత్రం టైటిల్ సాంగ్ గురువారం సాయంత్రం విడుదల చేసారు. మార్చి 15న ఆడియో విడుదల చేయనున్నారు. అయితే సినిమాకు ప్రచారం కల్పించడంలో భాగంగా అంతకంటే ముందుగానే టైటిల్ సాంగ్ విడుదల చేసారు.
ఈ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినాయక్ టైటిల్ సాంగ్ విడుదల చేయగా, సంగీత దర్శకుడు థమన్ సినిమా వాల్ పోస్టర్లు, మెహర్ రమేష్ పేరు మీద ఓపెన్ చేసిన యూట్యూబ్ అకౌంట్ ను వెంకటేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ...'ఇది నా మోస్ట్ ఫేవరెట్ టైటిల్ సాంగ్. సినిమా బాగా వచ్చింది. దర్శక నిర్మాతలకు థాంక్స్. మార్చి 15న ఆడియో విడుదల చేసి, వేసవిలో సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్. యాక్షన్ తో పాటు కామెడీ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. కోనవెంకట్, గోపీమోహన్ సహకారం బాగుంది' అన్నారు.

టైటిల్ సాంగ్ రిలీజ్ వేడుకకు హాజరైన వివి వినాయక్

మెహర్ రమేష్ యూట్యూబ్ అకౌంట్ ను ప్రారంభిస్తున్న వెంకీ

సినిమా విశేషాలు చెబుతున్న వెంకటేష్

యూనిట్ సభ్యులతో వెంకటేష్

అభివాదం తెలుపుతున్న వెంకటేష్
ఈచిత్రంలో వెంకీతో పాటు ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











