‘షాడో’ పబ్లిక్ టాక్...నిర్మాతలకు షాక్!
హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ హీరోగా డిజాస్టర్ సినిమాల దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన 'షాడో' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. సాధారణంగా ఏ స్టార్ హరో సినిమా అయినా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనడం సాధారణం. మరి దర్శకుడి గత చరిత్ర ప్రభావమో? లేక వెంకీ స్టార్ ఇమేజ్ డౌన్ అయిందో.. ఏమో తెలియదు కానీ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.
కాగా, సినిమా ఇండియాలో విడుదలవ్వడానికి ముందే యూఎస్‌తో పాటు, కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఆయా ప్రాంతాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా ఆశించిన స్థాయిలో లేదని, మెహర్ రమేష్ మరోసారి ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా సినిమాను తెరకెక్కించ లేక పోయాడని అంటున్నారు.
ముఖ్యంగా షాడో చిత్రంలో వెంకీని డిఫరెంట్ లుక్‌తో స్టైలిష్ గా చూపెడుతున్నాం అని దర్శకుడు ముందు నుంచీ చెప్పుకొస్తున్నాడు. అయితే మెహర్ రమేష్ స్టైలిష్ లుక్ విషయంలో చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే వాదన కూడా వినిపిస్తోంది. సినిమాకు మూల స్తంభం అయిన కథ, కథనంపై దర్శుకుడు దృష్టి పెట్టకుండా అనవసర ఆర్భాటాలకు ఎక్కువగా ఖర్చు పెట్టించాడని అంటున్నారు.
అయితే ఇదంతా ఓ కేటగిరీకి చెందిన ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. అయితే ఇతర కేటగిరీల ప్రేక్షకులు, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపైనే సినిమా భవిష్యత్ ఆధార పడింది. అది ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా...సినిమా తొలిరోజే ఇలాంటి టాక్ రావడంతో నిర్మాతలకు షాక్ లాంటి సంఘటనే అని చెప్పక తప్పదు. మరి షోడోలోని వివిధ అంశాలను బేరీజు వేస్తూ మా క్రిటిక్స్ విశ్లేషించిన విధానాన్ని రివ్యూలో చూడండి.


Click it and Unblock the Notifications











