Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెంకటేష్ ‘షాడో’ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'షాడో' రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ స్వయంగా ధృవీకరించారు. ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటూ ముగింపు దశకు చేరుకుంది.
వెంకీతో పాటు ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచంలోని ఆరు వేర్వేరు ప్రదేశాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.