తెలుగు సినిమా చరిత్రలో ‘షాడో’ సరికొత్త రికార్డు
హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది. హై క్వాలిటీ 'ఆరో 11.1 3డి' సౌండ్ తో విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించలేదు.
ఈ విషయమై దర్శకుడు మెహర్ రమేష్ స్పందిస్తూ 'ఆరో 11.1 3డి సౌండ్ తో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా షాడో. ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో 55 స్పీకర్లలో ఈ సౌండ్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఏపీలో ఇలాంటి సౌకర్యం ఉన్న మొదటి థియేటర్ ఇదే. ఈ సరికొత్త టెక్నాలజీ ఆస్వాదించండి. తమన్ ఆరో 11.1 3డి సౌండ్ కు తగిన విధంగా అద్భుతంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు' అంటూ ట్వీట్ చేసారు.
షాడో చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
ఏప్రిల్ 26న ఈ చిత్రం విడుదవుతోంది. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











