For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినాయక చవితికి వెంకీ ‘షాడో’ టీజర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్ రమేష్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి టీజర్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు.

    ఇందులో వెంకటేష్ ఇంటర్నేషనల్ డాన్‌గా కనిపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది.

    థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని..యునైటెడ్ మూవీస్ పతాకం సింహా చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. అయితే మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Victory Venkatesh is currently shooting for the action entertainer ‘Shadow’. The first teaser of the film will be revealed on Vinayaka Chavithi and this was revealed by director Meher Ramesh. Tapsi will be seen as the heroine in this movie. Srikanth will be playing a crucial role in the film along with Madhurima.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X