twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘షాడో’ థియేటర్లపై రాళ్లు రువ్విన ఫ్యాన్స్

    By Bojja Kumar
    |

    తిరుపతి : షాడో చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. తిరుపతిలోని భూమా థియేటర్, జగత్, విఖ్యాత్ థియేటర్ల వద్ద వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. థియేటర్ యాజమాన్యం అక్రమంగా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తుండటంతో ఆగ్రహం చెందిన అభిమానులు రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు, బ్లాక్ టికెటింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

    కాగా..వెంకటేష్ హీరోగా రూపొందిన 'షాడో' చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందించారు.

    ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ పొందినట్లు దర్శకుడు మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా ఫ్యామిలీ అంతా కలిసి ఆనందించేలా బాగుందని, సమ్మర్ హిట్‌గా నిలుస్తుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రశంసించినట్లు తెలిపారు.

    నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌. మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌, సంగీతం: తమన్‌. కెమెరా: ప్రసాద్‌, మూరెళ్ల, ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌. ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.

    English summary
    Shadow tickets in black-theatre glasses broken : Fans went into a frenzy on Friday morning, shouting at the management of the Bhuma cinema hall, alleging that the management was selling the tickets of ‘Shadow’ in black.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X