Don't Miss!
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అప్పుడు పవన్‌తో, ఇప్పుడు వెంకటేష్‌తో!
హైదరాబాద్ : జల్సా జల్సా అంటూ 'జల్సా' సినిమాలో, దేఖో దేఖో గబ్బర్‌సింగ్ అంటూ 'గబ్బర్ సింగ్' చిత్రానికి టైటిల్ సాంగ్ కేక పుట్టించిన ప్రముఖ పాప్ సింగర్ బాబా సెహగల్ ఇప్పుడు వెంకటేష్ నటిస్తున్న 'షాడో' చిత్రానికి కూడా టైటిల్ సాంగ్ దుమ్ము రేపేలా పాడబోతున్నాడు. ఈ మేరకు షాడో చిత్ర దర్శకుడు మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్ ఇందుకు సంబంధించిన పనిలో ఉన్నారు. షాడో ఆడియో మార్చి నెలలో నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
షాడో మూవీ ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వెంకీ డాన్ పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. షాడో' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.