విరాట్ ఇక వైస్ కెప్టెన్.. దేవుడు కాదు.. వారిని కలిపింది చుండ్రూ.. అనుష్క పెళ్లిపై ట్వీట్ల వర్షం
Recommended Video

బాలీవుడ్ తార అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం మీడియా ఊహాగానాల మధ్య ఇటలీలోని టస్కనీలో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చిత్ర పరిశ్రమ, క్రికెట్ ప్రముఖులెవరూ హాజరుకాలేదు. డిసెంబర్ 11వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విరాట్, అనుష్క సంయుక్తంగా తమ పెళ్లి ప్రకటన జారీ చేశారు. దాంతో దేశంలోనే ప్రముఖ సెలబ్రిటీ జంటగా మారిన విరాట్, అనుష్కలకు సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ సినీ ప్రముఖులు అమితాబ్, షారుక్ తదితరులు తమ శుభాకాంక్షలు తెలిపారు.

దేవుడు కలిపిన జంట
దేవుడు కలిపిన జంట అంటే ప్రస్తుతం విరాట్, అనుష్క మాత్రమే. జీవిత ప్రయాణంలో ఒక్కటైన వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సంతోషం, సంపూర్ణ ఆరోగ్యంతో దేవుడు వారిని చల్లగా చూడాలని కోరుకొంటున్నాను. దేవుడు కాదు.. వారిని డాండ్రఫ్ (చుండ్రూ) వారిని కలిపింది అని సరదాగా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వారిద్దరూ ఓ షాంపూ కంపెనీ యాడ్ షూట్ సమయంలో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

జీవితాంతం కలిసి ఉండాలి
వివాహ శుభ గడియల సందర్భంగా విరాట్, అనుష్కకు నా దీవెనలు, ఆశీస్సులు. జీవితాంతం కలిసి ఉండాలని దీవిస్తున్నాను అని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

అద్భుతమైన జంట
కంగ్రాట్స్. మీరు అద్భుతమైన జంటగా కనిపిస్తున్నారు. మీ ఇద్దరికి వివాహ శుభాకాంక్షలు అని సోనమ్ కపూర్ ట్వీట్ చేశారు.

దాంపత్య జీవితం అద్భుతంగా
దంపతులైన అనుష్క, విరాట్‌కు నా ప్రేమతో కూడిన శుభాకాంక్షలు. అత్యంత అందమైన జంట. భవిష్యత్‌లో వారి వివాహ జీవితం అద్భుతంగా ఉండాలి అని కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.

ఎప్పటికీ దేవుడి దీవెనలు
మీ జీవిత భాగస్వామ్యం ఎప్పటికీ ఇలానే ఉండాలి. దేవుడి దీవెనలు మీ వెంట ఉండాలి అని కోరుకొంటున్నాను. కంగ్రాట్స్ అని శ్రీదేవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

జీవితంలో సుఖ:సంతోషాలతో
వివాహం చేసుకొన్న శుభ తరుణంలో అనుష్క, కోహ్లీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎప్పడూ సుఖ:సంతోషాలతో ఉండాలి అని ఫర్హాన్ అఖ్తర్ ట్వీట్ చేశారు.

కలిసి జీవనం సాగించాలి
మీ దాంపత్య జీవితంలో అనంతమైన సుఖ: సంతోషాలు ఉండాలి. జీవితాంతం కలిసి జీవనం సాగించాలి. వివాహం చేసుకొన్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు అని శ్రద్ధాకపూర్ ట్వీట్ చేశారు.

వివాహితుల క్లబ్‌లోకి ఆహ్వానం
అనుష్క, విరాట్ దంపతులకు వివాహ శుభాకాంక్షలు. వివాహితుల క్లబ్‌లోకి ఆహ్వానం అని అభిషేక్ కపూర్ ట్వీట్ చేశారు.

కొత్త కెప్టెన్ అనుష్క
ఇక నుంచి విరాట్ కోహ్లీ ఇంటిలో వైస్ కెప్టెన్. వారి ఇంటిలో కొత్త కెప్టెన్‌గా అనుష్క ఎంపికైంది. ఇద్దరికి వివాహ శుభాకాంక్షలు అని నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు.

దేవుడు సృష్టించిన జోడి ఇది
దేవుడు సృష్టించిన జోడి ఇది. మీ వ్యక్తిగత, వృతిపరమైన జీవితంలో ఇది కీలకమైన పరిణామం. వాస్తవంగా వారిద్దరూ ఎంతో అందమైన వ్యక్తులు. వారి జీవితంలో ఎంతో మధురమైన క్షణాలు అని అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











