మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో షారుఖ్ ఖాన్!
షారుఖ్ అభిమానులకు ఇది నిజంగా క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మర్వెల్ స్టూడియో నిర్మాణంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించేందుకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అవెంజర్స్ సిరీస్ తో ఇండియాలో కూడా మర్వెల్ చిత్రాలకు అభిమానులు క్రమంగా పెరుగుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రంతో మర్వెల్ చిత్రాలకు అభిమానులు మరింతగా ఎక్కువయ్యారు. ఇండియాలో సినిమాకు భారీ స్థాయిలో మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ని ఉపయోగించుకోవడానికి మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తమ చిత్రాల్లో ఇండియన్ స్టార్ ని నటింపజేయడం ద్వారా మార్కెట్ సంపాదించాలనే ఆలోచనలో మర్వెల్ స్టూడియోస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షారుఖ్ ఖాన్ ముందు తమ ప్రతిపాదన ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. భవిషత్తులో మర్వెల్ స్టుడియోస్ నిర్మించే చిత్రాల్లో ఇండియాకు సంబందించిన కాన్సెప్ట్ ఉంటె షారుఖ్ ఖాన్ ని నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











