For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అట్లీ - షారుఖ్ ఖాన్ 'సంఖి'.. త్వరలోనే స్పెషల్ టీజర్.. డేట్ ఫిక్స్

  |

  కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ దర్శకుల్లో ఒకరైన అట్లీ కుమార్ బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. దళపతి విజయ్ తో వరుసగా హిట్స్ అందుకున్న అట్లీ నెక్స్ట్ సినిమాలు సైతం మరో లెవల్లో ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తేరీ, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అతని రేంజ్ ను అమాంతంగా ఆకాశానికి పెంచేశాయి. దీంతో అతని తదుపరి సినిమాలపై కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

  Vadinamma : పెను విధ్వంసం ప్లాన్ చేసిన పార్వతి.. అన్యాయం చేస్తారా అంటూ!

  Karthika Deepam అంజికి తలకు పిస్టల్ గురిపెట్టిన మోనిత.. తుపాకి పేలడంతో టెన్షన్‌లో దీప

  Ananya Panday మరింత హాట్‌గా.. బికినీలో క్లీవేజ్‌ షో.. లైగర్‌లో విజయ్ దేవరకొండతో ఇక రచ్చే!

  ఆ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఎన్టీఆర్ కూడా అట్లీ కుమార్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే సరైన కథ సెట్ అవ్వగాపోవడంతో వారి కాంబినేషన్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు అట్లీ బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. రెండేళ్లుగా జరుగుతున్న ఈ చర్చలకు ఇటీవల ముగింపు కార్డు పడినట్లు సమాచారం.

  Shah rukh khan Atlee project teaser launch date fix

  అట్లీ కుమార్ - షారుక్ ఖాన్ కాంబినేషన్ అనగానే దేశవ్యాప్తంగా ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్లు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం. ఈ కాంబో పై త్వరలోనే మరో అఫీషియల్ క్లారిటీ రానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ముందుగా దర్శకుడు ఒక టీజర్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇటీవల ముంబైకి వెళ్లిన అట్లీ కుమార్ అక్కడ ఒక స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేయించినట్లు సమాచారం. టీజర్ కోసం షారుక్ ఖాన్ తో కొన్ని స్పెషల్ షార్ట్స్ ను షూట్ చేయనున్నారట. ఆ టీజర్ ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు సమాచారం.

  ఇక ఈ సినిమాకు 'సంఖి' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్టవ్వడం కోసం దర్శకుడు గత ఏడాది నుంచి తీవ్రంగా శ్రమించాడు. అనేకసార్లు కథపై చర్చలు జరిపాడు షారుక్ ఖాన్ సలహాల మేరకు కొన్ని మార్పులు కూడా చేయాల్సి వచ్చింది. కథలో మెయిన్ పాయింట్ ఎక్కువగా నచ్చడం వలన షారూక్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. మొదట అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. కానీ ఆ తర్వాత దర్శకుడు షారుక్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా కథను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన విధానం బాగా నచ్చేసిందట.

  షారుక్ ఖాన్ తనకు తెలిసిన కొంతమంది దర్శకుల నుంచి కూడా సంఖి ప్రాజెక్టు విషయంలో సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అట్లీ కుమార్ కూడా సంకీ ప్రాజెక్టుకు షారుక్ ఖాన్ అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడని నిర్ణయం తీసుకొని ఆ కథపై రెండేళ్లు కూర్చున్నాడు. మొత్తానికి షారుక్ ఖాన్ ఫుల్ స్క్రిప్ట్ విన్న తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మరోవైపు షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.

  English summary
  It’s been nearly one and a half year since hindi ShahRukh Khan’s Zero released and bombed at the box-office. Since then, SRK has not announced any new project even though he was rumored to be in talks with popular directors like Rajkumar Hirani,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X