షారుఖ్‌ఖాన్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ఇక ఆ సినిమాని అప్పట్లో శాటిలైట్ చానల్స్‌లో ప్రసారం చేయడానికి ముందుగానే తనకి సంబంధించి పేరడీ సన్నివేశాల్ని తొలగించాలంటూ ఆయన కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవి పట్టించుకోకుండా ప్రసారం చేస్తున్నారు. జపాన్ లోనూ విడుదల చేసారు. ఇవన్నీ ఈ సీనియర్ హీరోని సీరియస్ అయ్యేలా చేసాయి.
మనోజ్ కుమార్ మాట్లాడుతూ... "ఆ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్‌లో 'ఓం శాంతి ఓం'ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వాళ్లను రెండుసార్లు క్షమించాను. ఈసారి అలా చేయలేను. వాళ్లు నన్ను అగౌరవ పరిచారు. అన్ని ప్రింట్లు, ప్రసార కాపీల నుంచి ఆ సన్నివేశాల్ని తొలగించమని 2008లోనే కోర్టు తీర్పునిచ్చింది. అందువల్ల వారు కోర్టు ధిక్కార నేరాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్‌పై రేపు సివిల్, క్రిమినల్ కేసుల్ని వేయబోతున్నాను'' అని చెప్పారు .


Click it and Unblock the Notifications












