twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుఖ్‌ఖాన్‌ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

    By Srikanya
    |

    ముంబై : షారుఖ్‌ఖాన్‌పై ఆనాటి స్టార్ హీరో మనోజ్‌కుమార్ మరోసారి మండిపడ్డారు. రూ. 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించిన 2007 నాటి సూపర్ హిట్ ఫిల్మ్ 'ఓం శాంతి ఓం'లో తనని అనుకరిస్తూ షారుఖ్ చేసిన పేరడీ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్‌లో ఆ సినిమాని విడుదల చేసారని ఆయన సీరియస్ అయ్యారు.

    ఇక ఆ సినిమాని అప్పట్లో శాటిలైట్ చానల్స్‌లో ప్రసారం చేయడానికి ముందుగానే తనకి సంబంధించి పేరడీ సన్నివేశాల్ని తొలగించాలంటూ ఆయన కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవి పట్టించుకోకుండా ప్రసారం చేస్తున్నారు. జపాన్ లోనూ విడుదల చేసారు. ఇవన్నీ ఈ సీనియర్ హీరోని సీరియస్ అయ్యేలా చేసాయి.

    మనోజ్ కుమార్ మాట్లాడుతూ... "ఆ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్‌లో 'ఓం శాంతి ఓం'ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వాళ్లను రెండుసార్లు క్షమించాను. ఈసారి అలా చేయలేను. వాళ్లు నన్ను అగౌరవ పరిచారు. అన్ని ప్రింట్లు, ప్రసార కాపీల నుంచి ఆ సన్నివేశాల్ని తొలగించమని 2008లోనే కోర్టు తీర్పునిచ్చింది. అందువల్ల వారు కోర్టు ధిక్కార నేరాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్‌పై రేపు సివిల్, క్రిమినల్ కేసుల్ని వేయబోతున్నాను'' అని చెప్పారు .

    English summary
    "I would file civil and criminal proceedings against the producers (Shah Rukh Khan and Eros International) for seeking damages to the tune of Rs 100 crore for showing Om Shanti Om in Japan without removing objectionable scenes as ordered by Mumbai civil court in 2008", Manoj Kumar said. Veteran actor Manoj Kumar will file a lawsuit against Shah Rukh Khan and Eros International, producers of 2007 hit Om Shanti Om, and seek damages to the tune of Rs 100 crore for releasing the film in Japan without removing certain scenes apparently lampooning him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X