twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    25 ఏళ్ల తర్వాత...ఈజిప్టులో మన సినిమా రిలీజ్

    By Srikanya
    |

    ముంబై : సూపర్ స్టార్ షారుక్‌ ఖాన్‌ నవ్వుల ఎక్స్‌ప్రెస్‌ 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' ఈజిప్టు వెళ్లబోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నవ్వుల జల్లు కురిపించిన ఈ సినిమాని ఈ నెల 9న ఈజిప్టులో విడుదల చేయనున్నారు. ఈజిప్టులో 25ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రదర్శితమవుతున్న భారతీయ సినిమా ఇది కావటం విశేషం. ఈ విషయమై ఈజిప్టులోని భారత రాయబారి నవదీప్‌ సూరి మీడియాతో మాట్లాడారు.

    నవదీప్‌ సూరి మాట్లాడుతూ.... ''ఈజిప్టు ప్రజలు భారతీయ సినిమాల్ని చూడటానికి చాలా ఇష్టపడతారు. ఇన్నాళ్లు వెండితెరపై చూసేఅవకాశం వాళ్లకు దక్కలేదు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో ఆ కోరిక నెరవేరబోతోంది'' అన్నారు. షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మొత్తం సౌతిండియా నేపథ్యంతో సౌతిండియా బాక్సాఫీసు వద్ద కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

    నార్త్ కుర్రాడు...సౌత్ అమ్మాయితో ప్రేమలో పడటమే కాన్సెప్టు తో వచ్చిన ఈ చిత్రంలో ...షారూఖ్ రాహుల్ గా కనిపిస్తాడు. అతను తన తాత.. అస్దికలను రామేశ్వరంలో కలిపాలని బయిలుదేరతాడు. అదే సమయంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తూండంతో ... తమిళనాడు గ్రామంలోని ..ఇంట్లోంచి పారిపోయి వచ్చిన మీనమ్మ(దీపిక పదుకోని)..చెన్నై ఎక్సప్రెస్ లో మన హీరోని కలుస్తుంది. ఆమెతో పాటు ఆమె తండ్రి (సత్యరాజ్)అనుచరులు..వెనకే ఉంటారు. ఈ లోగా టిక్కెట్ కలెక్టర్ వచ్చి వాళ్లని టిక్కెట్ అడగటంతో అతన్ని వెళ్లై ట్రైన్ లోంచి క్రిందకు తోసేస్తారు.

    ఈ సంఘటనకు సాక్ష్యం...రాహుల్ కావటంతో అతన్ని తమతోపాటు తమ గ్రామంకి రమ్మంటారు. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో అతను ఆమె తో పాటు వాళ్ల ఊరు వస్తాడు. అక్కడ ఆమె...రాహుల్ ని పెళ్లి తప్పించుకోవటం కోసం బోయ్ ప్రెండ్ గా పరిచయం చేస్తుంది. ఆ తమిళనాడులోని కుగ్రామంలో భాషకూడా రాని రాహుల్ ఎలా తప్పించుకుని బయిటపడ్డారు. వీరిద్దరు మద్య ప్రేమ కథ ఎలా చిగురించింది...చివరకు వీళ్లిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.

    English summary
    Egypt people will finally be able to watch Indian films in cinema halls after a gap of 25 years. In the mid-80s, Amitabh Bachchan was ruling the theatres in Egypt. His film, Mard, ran for several months, overshadowing Egyptian films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X