అంబానీ ఈవెంట్‌లో రామ్ చరణ్ అవమానం వెనుక జరిగింది ఇదే.. ఆధారాలతో నిజం బట్టబయలు
ఈ మధ్య కాలంలో ఎలాంటి చిన్న విషయం జరిగినా సోషల్ మీడియా వల్ల సెన్సేషన్ అయిపోతోంది. ముఖ్యంగా కొన్ని అంశాలు వివాదాలకు కారణం అవుతున్నాయి. అలాంటిదే ఇటీవలే జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో జరిగింది. అక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ అవమానించాడని ఓ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఆధారాలతో కూడిన వివరణ వచ్చేసింది. అసలు చరణ్‌కు నిజంగానే అవమానం జరిగిందా? అనే విషయాన్ని మీరే చూసేయండి మరి!
తెలుగు నుంచి ఒకే ఒక్కడు:రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో నిశ్చయం అయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ ఏడాది జులై 12న జరగనున్న నేపథ్యంలో ఇటీవలే జామ్ నగర్‌లో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ చేశారు. దీనికి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కడే హాజరయ్యాడు.

నాటు స్టెప్.. షారూక్ పిలిచి:అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది వచ్చారు. ముఖ్యంగా ఖాన్ త్రయం షారూక్, సల్మాన్, ఆమీర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు, వీళ్లు ముగ్గురూ RRR మూవీలోని నాటు నాటు పాటకు సైతం డ్యాన్స్ చేశారు. ఆ సమయంలోనే షారూక్ ఖాన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను స్టేజ్ మీదకు ఆహ్వానించాడు.

అలా అన్నాడని వివాదం:ఖాన్ త్రయం నాటు నాటు పాటకు స్టెప్ వేస్తున్న సమయంలో నీతా అంబానీ.. రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్‌లో ఉన్న విషయాన్ని షారూక్ ఖాన్‌కు చెప్పారు. అప్పుడతను మైక్‌లో 'ఇడ్లి వడ రామ్ చరణ్ కూడా స్టేజ్ మీదకు రావాలి' అని పిలిచాడు. దీంతో ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్ అలా పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈవెంట్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

షారూక్ సారీ చెప్పాలంటూ:ఈవెంట్ అయిపోయిన తర్వాత జెబా హాసన్ 'రామ్ చరణ్‌ను ఇడ్లీ, వడ' అని పిలవడాన్ని తప్పుబడుతూ పోస్ట్ చేశారు. దీంతో ఈ అంశం పెద్ద వివాదంగా మారిపోయింది. దీన్ని చాలా మంది హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో మాట్లాడడంతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఫలితంగా రామ్ చరణ్‌కు షారూక్ క్షమాపణలు చెప్పాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
అది సినిమాలో డైలాగయ్యా:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను షారూక్ ఖాన్ 'ఇడ్లి వడ' పేరుతో అవమానించాడని అతడి అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్‌షా ఫ్యాన్స్ మాత్రం షారూక్ తన సినిమాలోని డైలాగును మాత్రమే చెప్పాడని ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. అందులో నిజంగానే అతడు ఫేమస్ టిఫిన్స్‌తో పాటు రజినీకాంత్ పేరును కూడా చెబుతాడు.

ఇంకా గొప్పగా చెప్పాడుగా:అసలు విషయం ఏంటంటే.. 'వన్ 2 కా 4' అనే మూవీలో షారూక్ విలన్‌తో ఫేమస్ వంటకాల గురించి చెబుతూ చివర్లో 'సూపర్ స్టార్ రజినీకాంత్' అంటాడు. అలాగే, ఈ ఈవెంట్‌లో కూడా ఫేమస్ వంటకాల గురించి చెప్పి రజినీకాంత్ ప్లేస్‌లో రామ్ చరణ్ అన్నాడు. అంటే.. అతడిని అవమానించినట్లు కాదు.. ఇంకా పొగుడుతూ మాట్లాడినట్లు అంటూ వీడియో ద్వారా అర్థమైంది.


Click it and Unblock the Notifications











