»   » ముదురుతున్న షారుఖ్‌ఖాన్‌ - లింగ నిర్ధారణ వివాదం

ముదురుతున్న షారుఖ్‌ఖాన్‌ - లింగ నిర్ధారణ వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబయి: బాలీవుడ్‌ మెగా స్టార్ షారుఖ్‌ఖాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. షారుఖ్‌ అద్దెగర్భం ప్రక్రియ ద్వారా మూడో సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లు.. కాన్పుకు ముందే లింగనిర్ధరణ పరీక్ష చేయించినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

షారుఖ్‌ఖాన్‌, ఆయన భార్య గౌరీఖాన్‌లు అద్దె గర్భం ద్వారా మగసంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. తాజా కథనాలపై షారుఖ్‌ సహాయకుడిని ప్రశ్నించగా.. 'తామేమీ వ్యాఖ్యానించం' అంటూ మాట్లాడేందుకు నిరాకరించారు.

ఓ స్వచ్ఛంద సంస్థ, భారత రేడియోలాజికల్‌, ఇమేజింగ్‌ సంఘం డిమాండ్‌ మేరకు ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం బృహన్ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ను ఆదేశించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

ఇక షారుఖ్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'. ఈ సినిమాను రంజాన్‌ సందర్భంగా (ఆగస్టు 8) న విడుదల చేయబోతున్నారు. దీనికి పోటీగా అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి - ఎగైన్‌' వస్తుందనుకొన్నారు. అయితే ఆ చిత్ర నిర్మాత ఏక్తా కపూర్‌, షారుఖ్‌ల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఏక్తా తన చిత్రాన్ని ఓ వారం వెనక్కి వాయిదా వేసుకొన్నట్లు తెలిసింది.

ఈ సినిమా కథలో షారూక్ ..ముంబై నుంచి రామేశ్వరం కు వెళ్లే వ్యక్తిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కింది. దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక..ఎలా చేసినా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు. ఆగస్టు 8న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Shah Rukh Khan is in deep in trouble after the Indian Radiological and Imaging Associations (IRIA) raised questions on the actor's knowledge of the sex of the unborn baby that he and his wife were to welcome in July through surrogacy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu