»   » ఇన్నాళ్లకు సూపర్ స్టార్ చేతికి డిగ్రీ... అది కూడా లేనిస్టార్స్ (లిస్ట్)

ఇన్నాళ్లకు సూపర్ స్టార్ చేతికి డిగ్రీ... అది కూడా లేనిస్టార్స్ (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సక్సెస్ ఫుల్ పర్సన్ అని నిరూపించుకోవడానికి ఎన్నోమార్గాలు ఉన్నాయి. అందుకు తప్పనిసరిగా డిగ్రీ ఉండాలని ఏమీ లేదు. ముఖ్యంగా గ్లామర్ వరల్డ్‌లో ఎడ్యుకేషన్‌కు పెద్ద ప్రాధాన్యతే ఉండదు. అక్కడ టాలెంట్ ఉన్నోడికే ప్రాముఖ్యత. ఎంతో మంది స్టార్స్ తమ యాక్టింగ్ టాలెంటుతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ రంగంలో సక్సెస్ ఫుల్ పర్సన్స్‌గా ఎదిగారు. అయితే అందులో చాలా మంది కనీసం డిగ్రీ కూడా పాసవలేదంటే మీరు నమ్ముతారా?

మన తెలుగు స్టార్స్ ఎంత వరకు చదువుకున్నారు?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ దాదాపు 28 సంవత్సరాల తర్వాత డిగ్రీ పట్టా పొందారు. షారుక్ 1985-88 సమయంలో ఢిల్లీలోని ప్రఖ్యాత ‘హాన్స్ రాజ్' కాలేజ్ నుండి బిఏ(హానర్స్) చదవారు. చదువు అయిపోగానే, పట్టా చేతికి రాకముందే ఆయన ముంబై షిప్ట్ అయ్యారు. సినిమా రంగంలో ఆయనకు తన స్టడీ సర్టిఫికెట్ ఉపయోగించుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా షారుక్ తర రాబోయే చిత్రం ‘ఫ్యాన్' టైటిల్ ట్రాక్ రిలీజ్ చేసేందుకు మళ్లీ తాను చదవిన కాలేజీకి వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ షారుక్ ఖాన్ డిగ్రీ పట్టా ప్రధానం చేసారు. దీంతో షారుక్ సర్ ప్రైజ్ అయ్యారు.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ ఇప్పటికీ డిగ్రీ పూర్తి చేయలేదు. మోడలింగ్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాడ్యుయేట్ అయిన వారినే తీసుకోవాలనే రూలేం లేదు కాబట్టి ఆమె దానిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒక వేళ అలాంటి రూల్ ఉంటే పూర్తి చేసేదేమో?

సినిమా, మోడలింగ్ రంగంలో ఉండే వారికి ఆ రంగంలోని షెడ్యూల్స్ కారణంగా....కాలేజీకి వెళ్లే పరిస్థితి దాదాపుగా ఉండదు. బుక్స్ చదివేందుకు అసలే సమయం దొరకదు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు డిగ్రీ పూర్తి చేయకుండా మిగిలి పోతున్నారు. దీపిక పదుకోన్‌తో పాటు అమీర్ ఖాన్ ఇలా...చాలా మంది ఈ లిస్టులో ఉన్నారు.

ఇన్నాళ్లకు షారుక్ ఖాన్ చేతికి డిగ్రీ పట్టా...

ఇన్నాళ్లకు షారుక్ ఖాన్ చేతికి డిగ్రీ పట్టా...

షారుక్ 1985-88 సమయంలో ఢిల్లీలోని ప్రఖ్యాత ‘హాన్స్ రాజ్' కాలేజ్ నుండి బిఏ(హానర్స్) చదవారు. చదువు అయిపోగానే, పట్టా చేతికి రాకముందే ఆయన ముంబై షిప్ట్ అయ్యారు. సినిమా రంగంలో ఆయనకు తన స్టడీ సర్టిఫికెట్ ఉపయోగించుకోవాల్సిన అవసరం రాలేదు.

అమీర్

అమీర్

షాకయ్యారా? మీరు నమ్మినా నమ్మక పోయినా అమీర్ ఖాన్ ఇప్పటికీ తన గ్రాజ్యుయేషన్ పూర్తి చేయలేదు. ముంబైలోని నర్సీ మోంజీ కాలేజీలో 12వ గ్రేడు పూర్తయిన తర్వాత సినిమా రంగంలో అడుగు పెట్టాడు అమీర్ ఖాన్.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సినిమాలపై ఉన్న మోజు వల్ల సల్మాన్ ఖాన్ పెద్దగా చదువుపై దృష్టి పెట్టలేక పోయాడు. ముంబైలోని సెయింట్ స్టానిస్లాస్ హైస్కూల్, ది సింధియా స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన సల్మాన్ ఖాన్....ఆ తర్వాత నేషనల్ కాలేజీలో చేరాడు కానీ మధ్యలోనే చదువు వదిలేసాడు.

కరిష్మా కపూర్

కరిష్మా కపూర్

హీరోయిన్ కరిష్మా కపూర్ డిగ్రీ కాదు కదా...కనీసం టెన్త్ క్లాస్ కూడా పూర్తి చేయలేదు. 16వ ఏటనే సినిమా రంగంలో అడుగు పెట్టిన ఆమె 6వ క్లాసులోనే చుదువలకు రాంరాం చెప్పేసిందట.

ఐశ్వర్యరాయ్ బచ్చన్

ఐశ్వర్యరాయ్ బచ్చన్

హీరోయిన్ ఐశ్వర్యరాయ్ చదువుల్లో చాలా చురుకు. హైస్కూల్ ఎగ్జామ్స్‌లో 90 శాతం మార్కులు సాధించిన ఆమె ఆర్కిటెక్ట్ కావాలనుకుంది. రహేజా కాలేజీలో చేరింది. కానీ మోడలింగ్ రంగంపై ఆసక్తితో చదువు మధ్యలోనే వదిలేసింది.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

బాలీవుడ్లో పెద్దగా చదువుకోని తారల్లో దీపిక పదుకోన్ ఒకరు. ఐజిఎన్ఓయూ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీలో చేరిన దీపిక పదుకోన్ మోడలింగ్, సినిమా రంగంపై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసి ఇప్పటికీ డిగ్రీ పూర్తి చేయలేదు.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

17 ఏటనే మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోయింది. ఇంత జిజీ అయ్యాక చదువు సాగేలేదు.

అలియా భట్

అలియా భట్

చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన మరో హీరోయిన్ అలియా భట్. స్కూలు చదువు పూర్తికాగానే సినిమా రంగంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ప్రస్తుతం సినిమాలతో బిజీ కావడంతో ఇంటర్మీడియట్ పూర్తి చేయడం కూడా కష్టమే అవుతోందట.

కరీనా కపూర్

కరీనా కపూర్

అక్కయ్య కరిష్మాలా కాకుండా బాగా చదువుకుని లాయర్ కావాలనుకుంది కరీనా కపూర్. కానీ సినిమా రంగం ఆమెను ఊరించడంతో లాయర్ కావాలనుకున్న తన లక్ష్యాన్ని పక్కన పెట్టేసింది.

English summary
shah Rukh Khan completed his graduation in BA (Honors) in Economics from one of the most prestigious colleges in New Delhi, the Hansraj College way back in 1985-1988. Shah Rukh was at his alma mater Hansraj College to release the title track single from his upcoming film Fan. But during the promotional event, Shah Rukh was pleasantly surprised even the principal of Hansraj gave SRK his bachelors degree.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu