షారూఖ్ "డాన్": మరో సారి అండర్ వరల్డ్ కథతో సిద్దమౌతున్న కింగ్ ఖాన్
షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన రెండు 'డాన్' చిత్రాలు జనాన్ని అలరించాయి. ఇప్పుడు వాటి సిరీస్ లోనే 'డాన్-3' రానుందని వినిపిస్తోంది. ఇంతకీ ఆ ముచ్చటేంటంటారా..
Recommended Video

షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన రెండు 'డాన్' చిత్రాలు జనాన్ని అలరించాయి. ఇప్పుడు వాటి సిరీస్ లోనే 'డాన్-3' రానుందని వినిపిస్తోంది. ఇంతకీ ఆ ముచ్చటేంటంటారా.. విఖ్యాత బాలీవుడ్ రచయితల ద్వయం 'సలీమ్-జావేద్' రాసిన 'డాన్' చిత్రం అమితాబ్ బచ్చన్‌ను ఆల్ ఇండియా సూపర్ స్టార్‌గా నిలిపింది. ఇదే కథను ఆ రచయితల ద్వయంలోని జావేద్ తనయుడు పర్హాన్ అక్తర్ 'డాన్' పేరుతోనే షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు.

'డాన్' రీమేక్
ఈ సినిమా పలు విమర్శలు ఎదుర్కొన్నా, మొత్తానికి 'డాన్' రీమేక్ అన్న ఆసక్తితో వసూళ్ళు బాగానే రాబట్టింది. అయితే ఒరిజినల్ 'డాన్'ను చెడగొట్టారని కొందరు విమర్శకులు అన్నారు. దానిని ఛాలెంజ్‌గా తీసుకొని ఫర్హాన్ అక్తర్, అదే షారుఖ్ ఖాన్ తో 'డాన్-2' తెరకెక్కించాడు. కానీ ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

అండర్ వరల్డ్ డాన్
బిగ్ బి అమితాబ్ బచ్చన్ 'డాన్' చిత్రం 1978లో విడుదలై సూపర్ హిట్టయ్యింది. అండర్ వరల్డ్ డాన్ పాత్రలో అమితాబ్‌ను తప్పితే వేరెవరినీ ఊహించలేమని చాలామంది అన్నారు. కానీ ఈ పాత్రను తాను చేసి మెప్పించగలనని ఆ తర్వాతి తరంలో షారుఖ్ ఖాన్ నిరూపించాడు. 2006లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 'డాన్' చిత్రాన్ని రీమేక్ చేసి శబాష్ అనిపించుకున్నాడు షారుఖ్.

ఫర్హాన్ అక్తర్
అమితాబ్ 'డాన్'లా షారుఖ్ 'డాన్' లేదనే విమర్శలు వినిపించడంతో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఛాలెంజ్‌గా తీసుకొని 'డాన్-2' రూపొందించాడు. డాన్-2' చూసి జనం షారుఖ్, ఫర్హాన్‌ను అభినందించారు. ప్రస్తుతం షారుఖ్‌కు సరైన సక్సెస్ లేక చాలా రోజులయింది. దాంతో "డాన్-3"పై మనసు పడ్డాడని సమాచారం.

ఫర్హాన్ అక్తరే దీనిని డైరెక్ట్ చేస్తాడా?
అందుకు సహ నిర్మాత రితీష్ శిద్వానీ కూడా రెడీ అయ్యాడు. ఓ కథను అనుకున్నామని, దానిని రైటర్స్ డెవలప్ చేస్తున్నారని తెలిపాడు. మూడో భాగంలోనూ షారుఖ్, ప్రియాంక నటిస్తారా? ఫర్హాన్ అక్తరే దీనిని డైరెక్ట్ చేస్తాడా అనే అంశాలను అధికారికంగా త్వరలో ప్రకటిస్తానని ఊరిస్తున్నాడు రితీష్.

అప్పుడే చెప్పలేం
షారుఖ్ ఖాన్, ఫర్హాన్ అక్తర్‌తో కలసి రితేశ్ సిధ్వానీ 'డాన్' సీరీస్ నిర్మించాడు. ప్రస్తుతం సిధ్వానీ 'ఫక్రీ రిటర్న్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే తిరుగుతున్న సిధ్వానీ, 'డాన్-3' నిర్మించే ఉద్దేశం ఉందని మీడియాకు చెప్పాడు. 'డాన్-3'ని తెరకెక్కించాలని తాను, షారుఖ్, ఫర్హాన్ సీరియస్‌గా ఆలోచిస్తున్నామని, అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేమని అన్నాడు సిధ్వానీ.

పరాజయాల బాటలో షారుఖ్
అయితే తప్పకుండా తాము 'డాన్-3'ని రూపొందించి జనం ముందు నిలుపుతామని అతను చెబుతున్నాడు. మరి అదే జరిగితే ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్న షారుఖ్ ఖాన్ కు 'డాన్-3' పెద్ద ఊరట ఇస్తుందనే చెప్పొచ్చు. మరి 'డాన్-3' ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











