»   » కత్రినా కైఫ్ , షారూఖ్ ఖాన్ బందువా కాదా ??

కత్రినా కైఫ్ , షారూఖ్ ఖాన్ బందువా కాదా ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

షారుక్‌- కత్రినాలది జబ్ తక్ హే జాన్ జోడి. ఇప్పుడీ జోడి మరోసారి కనువిందు చేయనుంది. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో షారుక్‌ నటిస్తున్నాడు.. కొన్నాళ్ళుగా షారుక్‌కి జంటగా ఎవరు నటించనున్నారు అన్నదానిపై చర్చ జరుగుతోంది. కంగనా రనౌత్‌, దీపిక పదుకొణె, పరిణీతి చోప్రా, సోనమ్‌కపూర్ల పేర్లు వినిపించాక కంగనా ఫైనల్ అన్నారు. అయితే చివరినిమిషం లో కత్రిన కైఫ్ వచ్చేసింది....

ఈ సినిమాకి 'బంధువా' టైటిల్‌ అనుకున్నారని వార్తలు వచ్చినా అది ఇంకా ఖరారు కాలేదు. షారూఖ్ పాత్ర ని బట్టి ఈ టైటీల్ ని నిర్ణయించాల్సి ఉందనీ..., త్వరలో బందువా అవునా కాదా అని తెలిసి పోతుందనీ సమాచారం .ఇంతవరకూ ఎప్పుడూ చేయని పాత్ర చేయబోతున్నాడట షారూఖ్ ఖాన్ .

Shah Rukh Khan's film with Aanand L Rai is not 'Bandhua'

ఎలాంటి పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోతాడు కింగ్‌ ఖాన్‌ షారుక్‌. 'ఫ్యాన్‌'లో డబుల్‌ రోల్‌లో మెప్పించిన షారుక్‌ ఈసారి మరో ప్రయోగం చేయబోతున్నాడు మరీ అమీర్ ఖాన్ లా ప్రతీ సినిమా ఒక ప్రయోగం అనుకోని షారూఖ్ అప్పుడప్పుడూ కొన్ని వేశాలేస్తూంటాడు. మై నేం ఈజ్ ఖాన్, ఫ్యాన్ లలో షారూఖ్ చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎవరూ మర్చిపోలేం. ఫ్యాన్ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా షారూఖ్ నటన మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. అదే తరహాలో ఇప్పుడు ఇంకో కొత్త గెటప్ తో రానున్నాడు ఈ కింగ్ ఆఫ్ బాలీవుడ్.

ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో షారుక్‌ ఒక మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పుడు కమల్ హసన్ అప్పురాజా (విచిత్ర సోదరులు) లో చేసిన సినిమా తప్ప బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో తోనూ ఇలాంటి పాత్ర ఎవరూ చేయించలేకపోయారు. అంతే కాదు కొన్ని సారు ఆ పాత్రలో ఉండే కష్టం కూడా వెనకడుగు వేయించింది. 'బంధువా' ఈ రొమాంటిక్‌ డ్రామా చిత్రీకరణను డిసెంబర్‌లో ప్రారంభించి సినిమాను 2018లో డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ చిత్రంలో షారుక్‌కి జంటగా కత్రినా కైఫ్‌ని ఎంపిక చేసుకున్నట్లు టాక్‌. రొమాంటిక్‌ డ్రామా తెరకక్కనున్న ఈ చిత్రంలో షారుక్‌ మరుగుజ్జుగా కనిపిస్తాడని టాక్. ఈ చిత్రానికి రెహ్మాన్ మ్యూజిక్.

English summary
King of Bollywood Shahrukh Khan And Katrina Kaif Star In A New Movie Together After ‘Jab Tak Hai Jaan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu