హీరో మోకాలికి గాయం...ఇబ్బంది
న్యూఢిల్లీ: దీపావళి రోజున విడుదల కానున్న తన చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ మోకాలికి గాయమైంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఫలితంగా ఢిల్లీలో సోమవారం నిర్వహించాల్సిన ప్రచార కార్యక్రమంలో కొంత జాప్యం చోటుచేసుకుంది. నడవడానికి ఆయన ఇబ్బంది పడ్డారు. ఇది చిన్నపాటి గాయమేనని, త్వరలోనే కోలుకుంటానని ఆయన తెలిపారు.
ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' వస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని సైతం ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకుని, ఆ మేరకు పోస్టర్ ని కూడా రీసెంట్ గా విడుదల చేసారు. ''నా అభిమానుల కోసమే మా చిత్ర బృందం ఈ ప్రపంచ యాత్ర చేస్తుంది''అని షారుఖ్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించారు. దీపావళికి ఈ చిత్రం విడుదలకానుంది.

ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ప్రపంచాన్ని చుట్టేయాలని భావిస్తున్నాడు. తన కొత్త చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' కోసం. ఈ సినిమా ప్రచారం కోసమే ఈ పర్యటన. ఈ యాత్రకి 'స్లామ్' అనే పేరు పెట్టారు.


Click it and Unblock the Notifications











