కొడుకు లాంచ్ కన్ఫర్మ్...ఫ్యాన్స్ కి పండుగ

By Srikanya

ముంబై‌: వారసలు ఇండస్ట్రీకి రావటం కొత్తేమీకాదు..సినిమా పరిశ్రమ పుట్టిన నాటి నుంచి జరుగుతున్నదే. ఇప్పుడు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ త్వరలో వెండితెరపై కనువిందు చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. షారూఖ్ సన్నిహితుడు దర్శక, నిర్మాత కరణ్‌జొహార్‌ ఈ భాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు.

ఇటీవల హిందూ స్దాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...తనకు షారుక్‌ మంచి సన్నిహితుడని... ఆయన కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ని తానే బాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నట్లు కరణ్‌జొహార్‌ తెలిపారు.

Shah Rukh Khan's son Aryan will be launched by Karan Johar

కాబట్టి ఆర్యన్‌ని ఇండస్ట్రీకి తాను మాత్రమే పరిచయం చేయగలనని పేర్కొన్నారు. షారుక్‌తో కలిసి పనిచేసిన రోజులను ఈ సందర్భంగా కరణ్‌ గుర్తుచేసుకున్నారు. తాను మంచి నిర్మాత, దర్శకుడు కాగలనని నమ్మిన మొదటి వ్యక్తి షారుకేనని ఆయన తెలిపారు.

సినిమాల గురించి ప్రతి చిన్న విషయాన్ని షారుఖ్‌ వివరించి ఈరోజు మంచి దర్శక నిర్మాతలా తనను తీర్చిదిద్దాడని కరణ్‌ చెప్పుకొచ్చారు. అలాగే ఆర్యన్ పెద్ద సక్సెస్ ఫుల్ హీరో అవుతాడని ఆశిస్తున్నట్లు తెలియచేసారు. ఇటీవల షారూఖ్ నటించిన దిల్ వాలే చిత్రం విడుదలై భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X