వివాహ వేడక: హైదరాబాద్ చేరుకున్న సల్మాన్ సోదరి

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ప్రేమ వివాహం ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ గత కొంత కాలంగా ప్రేమవ్యహారం నడుపుతోంది.

వివాహ వేడుకలో భాగంగా అర్పిత ఖాన్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరకుంటారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తన రేంజికి తగిన విధంగా ఈ ఇన్విటేషన్ వేయించారు. ముంబైలో జరిగిన సంగీత్ వేడుకకు షారుక్ ఖాన్ హాజరై అర్పితా ఖాన్‌ను ఆశీర్వదించారు.

సంగీత్, మెహందీ, వివాహ వేడుకల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రెండు రోజుల పాటు ఎంటైర్ ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్ రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి సల్మాన్ బుక్ చేసారు. వివాహం అనంతరం నవంబర్ 21న తేదీన ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. పెళ్లి వేడుకకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించినట్లు సమాచారం.

Shah Rukh Khan and Salman Khan bless Arpita Khan on her sangeet ceremony

సల్మాన్ ఖాన్ సోదరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలను నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. తన ముద్దుల చెల్లిలి కోసం ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడటం లేదట సల్మాన్. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది. ఈ వివాహ వేడుకకు దేశ వ్యాప్తంగా 250 ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వెంకటేష్ కూడా ఈ ఆహ్వానం అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X