షాకింగ్: షారుక్ ఖాన్‌కు వేలకోట్ల ఆస్తులు, రెండో స్థానం!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? తెలుసుకుంటే మీ దిమ్మ తిరిగి పోతోంది. తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం షారుక్ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన యాక్టర్ల లిస్టులో 2 స్థానంలో ఉన్నాడు. 'వెల్త్-ఎక్స్' అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ విడుదల చేసిన హాలీవుడ్-బాలీవుడు ధనవంతులైన యాక్టర్ల జాబితాలో షారుక్ 2వ స్థానం దక్కించుకున్నాడు.
ఈ లిస్టులో హాలీవుడ్ కమెడియన్ జెర్రీ సెయిన్ఫీల్డ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ మేగజైన్ చెబుతున్న లెక్కల ప్రకారం అతని ఆస్తుల విలువ 820 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4818 కోట్లు). ఆయన తర్వాతి స్థానాన్ని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ దక్కించుకున్నాడు. టాప్ 10 లిస్టులో షారుక్ ఖాన్‌కు మాత్రమే చోటు దక్కింది.
హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూయిజ్, టామ్ హంక్స్, క్లైంట్ ఈస్ట్ వూడ్ లాంటి వారిని షారుక్ వెనక్కి నెట్టేసారు. 'వెల్త్ ఎక్స్' చెప్పిన వివరాల ప్రకారం షారుక్ ఖాన్ ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు(సుమార్ రూ. 3525 కోట్లు). షారుక్ ఖాన్ కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత, టీవీ హోస్ట్, ఐపీఎల్ టీం కో-ఓనర్ కూడా.
హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ ధనవంతులైన యాక్టర్ల లిస్టులో మూడో స్థానం దక్కించుకున్నాడు. అతని ఆస్తుల విలువ 480 మిలియన్ డాలర్లు. జానీ డిప్, టైలర్ పెర్రీ 450 మిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాతి స్థానంలో జాక్ నికోల్సన్ 400 మిలియన్ డాలర్లు, టామ్ హంక్స్ 390 మిలియన్ డాలర్లు, క్లైంట్ ఈస్ట్ వుడ్ 370 మిలియన్ డాలర్లుతో టాప్ 10 ధనవంతులైన యాక్టర్ల లిస్టులో ఉన్నారు.

జెర్రీ సెయిన్ఫీల్డ్
హాలీవుడ్ కమెడియన్ జెర్రీ సెయిన్ఫీల్డ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆస్తుల విలువ 820 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4818 కోట్లు).

షారుక్ ఖాన్
షారుక్ ఖాన్ ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు(సుమార్ రూ. 3525 కోట్లు).

టామ్ క్రూయిజ్
హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ ధనవంతులైన యాక్టర్ల లిస్టులో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఆస్తుల విలువ 480 మిలియన్ డాలర్లు.

జానీ డిప్
450 మిలియన్ డాలర్లతో హాలీవుడ్ నటుడు జానీ డిప్ 4వ స్థానంలో ఉన్నాడు.

టైలర్ పెర్రీ
450 మిలియన్ డాలర్లతో హాలీవుడ్ నటుడుటైలర్ పెర్రీ 5వ స్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











