అమీర్ వదిలేశాడు.. షారుక్ పట్టుకొన్నాడు.. ఆ సినిమా ప్రపంచంలోనే ఓ అద్భుతమట..

By Rajababu

ఒక హీరో వదిలేసిన చిత్రాన్ని మరో హీరో చేసి హిట్ కొట్టిన దాఖలాలు సినీ పరిశ్రమలో చాలానే ఉన్నాయి. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందబోయే చిత్రం రాకేశ్ శర్మ బయోపిక్. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ నటించాల్సి ఉంది. కానీ తాజాగా క్రియేటివ్ విభేదాల కారణంగా రాకేశ్ శర్మ బయోపిక్‌ను వదిలేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రానికి ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.

 మరుగుజ్జు పాత్ర కష్టంగా

మరుగుజ్జు పాత్ర కష్టంగా

రాకేశ్ శర్మ బయోపిక్‌పై వస్తున్న వార్తలపై షారుక్ ఖాన్ స్పందించాడు. ఇటీవల 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రకటన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను కొత్త మూవీ ఇంకా అంగీకరించలేదు. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రంలోని మరుగుజ్జు పాత్ర చాలా కష్టమైనది. అందుకే ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతున్నది. వచ్చే ఫిబ్రవరి వరకు ఈ చిత్రంపైనే దృష్టిపెడుతాను అని షారుక్ అన్నారు.

 కొత్త ప్రాజెక్ట్‌పై చర్చలు

కొత్త ప్రాజెక్ట్‌పై చర్చలు

ప్రస్తుతం సిద్ధార్థ్ రాయ్ కపూర్, మరికొందరి నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే కొత్త చిత్రం గురించి నిర్ణయం తీసుకోవడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. అప్పటివరకు కొత్త సినిమా ప్రస్తావన ఉండదు అని షారుక్ వెల్లడించారు.

 ఓ విభిన్నమైన చిత్రంలో

ఓ విభిన్నమైన చిత్రంలో

అయితే తాను ఓ విభిన్నమైన చిత్రంలో నటించబోతున్నాను. అది చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించే చిత్రం. ఆ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాను అని షారుక్ ఓ హింట్ ఇచ్చాడు. దాంతో షారుక్ వద్దకు అమీర్ ఖాన్ వదిలేసిన రాకేష్ శర్మ బయోపిక్ వచ్చి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

 ప్రపంచంలోనే ఓ అద్భుతంగా

ప్రపంచంలోనే ఓ అద్భుతంగా

ఆనంద్ లాయ్ చిత్రం తర్వాత తాను నటించబోయే చిత్రం ప్రపంచంలోనే ఓ అద్భుతమైన చిత్రంగా మారిపోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రూపొందబోయే చిత్రం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. కొత్త అనుభూతిని పంచుతుంది. నా సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టింది. అలాంటి చిత్రాలు చాలా అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే వస్తాయి అని షారుక్ చెప్పారు.

 రాకేశ్ శర్మ బయోపిక్‌పై

రాకేశ్ శర్మ బయోపిక్‌పై

షారుక్ ఖాన్ ఇలాంటి ఫీలర్లను ఇండస్ట్రీలోకి వదలడంతో ఆ చిత్రం పక్కాగా రాకేశ్ శర్మ జీవితమే అనే మాట బలంగా వినిపిస్తున్నది. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ వదిలేసిన తర్వాత షారుక్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే మాట ఈ మధ్యకాలంలో వచ్చింది.

 మహాభారతంపై అమీర్ ఖాన్

మహాభారతంపై అమీర్ ఖాన్

ఇక అమీర్ ఖాన్ ఇంతో ఇష్టపడి ఎంచుకొన్న చిత్రం రాకేష్ శర్మ బయోపిక్. అయితే క్రియేటివ్ విభేదాల కారణంగా వదులుకొంటున్నట్టు చెబుతున్నా.. కారణం మరోకటి ఉందనే వార్తలు వెలుగుచూశాయి. ప్రస్తుతం మహాభారతం చిత్రాన్ని రూపొందించే పనిలో అమీర్ ఖాన్ ఉన్నట్టు తెలుస్తున్నది.

 ఐదు భాగాలుగా మహాభారతం

ఐదు భాగాలుగా మహాభారతం

అమీర్ ఖాన్ రూపొందించే మహాభారతం సుమారు 5 భాగాలు ఉంటుందట. మహాభారతం పార్ట్1కు సీక్రెట్ సూపర్‌స్టార్ దర్శకుడు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తారనేది ప్రాథమిక సమాచారం. మిగితా భాగాలకు అమీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X