చెన్నైలో షారుక్ కు చేదు అనుభవం, బహిష్కరణ

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కు చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ‘హ్యాపీ న్యూ ఇయర్' సినిమా ప్రమోషన్ కోసం చెన్నై వచ్చిన ఆయన ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అయితే ఈ ప్రెస్ మీట్ ను మీడియా ప్రతినిధులు బహిష్కరించారు. షారుక్, అతని సిబ్బంది ప్రవర్తన అభ్యంతర కరంగా ఉందని మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం అని చెప్పిన షారుక్....8 గంటలయినా రాలేదు. అప్పటికే వెయిట్ చేసీ వెయిట్ చేసీ విసిగి పోయిన మీడియా వారికి షారుక్ ప్రత్యేకంగా ఓ టీవీ ఛానల్ వారికి ఇంటర్వ్యూ ఇస్తున్నారన్న విషయం తెలియడంతో రగిలిపోయారు. ఆయన గదిలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిన వారిని షారుక్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో షారుక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు మీడియా ప్రతినిధులు.

తీరికగా బయటకు వచ్చిన షారుక్....క్షమాపణలు చెప్పారు. తనకు సమావేశం గురించి సరైన అవగాహన లేదని చెప్పారు. క్లారిటీ లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మీడియా వారు ఆయన ప్రెస్ మీట్ ను బహిష్కరించారు. దీంతో షారుక్ ప్రెస్ మీట్ నిర్వహించకుండానే చెన్నై నుండి వెళ్లి పోయారు.

సినిమా వివరాల్లోకి వెళితే...
కింగ్ ఖాన్ తో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే నటిస్తుంది. దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఫరాహ్ ఖాన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, బోమన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా మూవీ లో నటిస్తున్నారు.

Shah Rukh Khan snubbed by journalists in Chennai

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X