Pathaan Twitter Review: పఠాన్ మూవీకి అలాంటి టాక్.. ఎవరూ ఊహించని విధంగా.. ఇంతకీ షారూఖ్ కొట్టాడా!
చాలా గ్యాప్ తర్వాత షారూఖ్ నటించిన చిత్రమే ‘పఠాన్’. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ఇంతకీ షారూఖ్ హిట్ కొట
సుదీర్ఘ కాలం పాటు ఇండియాలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపించిన ఆయన.. టాప్ కలెక్షన్లు సాధిస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అయితే, కొంత కాలంగా ఈ సీనియర్ హీరో సినిమాలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత షారూఖ్ నటించిన చిత్రమే 'పఠాన్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ఇంతకీ షారూఖ్ హిట్ కొట్టాడా? లేదా? అన్నది చూద్దాం పదండి!

పఠాన్‌గా ఎంట్రీ ఇచ్చిన షారూఖ్
చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ 'పఠాన్' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

అలాంటి కథతో వస్తున్న పఠాన్
సాధారణంగా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ సినిమాలు యాక్షన్ ఎంటర్‌టైనర్‌లుగా వస్తుంటాయి. ఇప్పుడు షారూఖ్ నటించిన 'పఠాన్' కూడా అదే పంథాలో రాబోతుంది. డేంజరస్ సింథటిక్ వైరస్ రిలీజ్‌ను నిరోధించేందుకు ఒక అండర్ కవర్ కాప్, మాజీ నేరస్తుడు కలిసి నిర్వహించే మిషన్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఇప్పటికే కొన్ని వార్తలు లీక్ అయిపోయాయి.
షారూఖ్ మూవీకి అలాంటి టాక్
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఎక్కువ మంది ఈ సినిమా చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
ఫస్టాఫ్ అలా.. ఇంటర్వెల్ రచ్చ
బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో 'ట్రైలర్ చూసి సినిమా కథ మొత్తం తెలిసిపోయింది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అందులో ఏమీ చూపించలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంతో గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. షారూఖ్ నటన అద్భుతంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.
మూవీ గురించి ఏమి చెప్పను
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పఠాన్' మూవీని చూసిన మరో నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో 'ఇప్పుడే షారూఖ్ పఠాన్ మూవీని చూశాను. అసలు ఈ మూవీ గురించి ఏమి చెప్పను? ఈ సినిమా చాలా బాగుంది. నాకు మాత్రం బాగా నచ్చింది' అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
పఠాన్ విన్నర్ అంటూ ట్వీట్
షారూఖ్ 'పఠాన్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించాడు. 'పఠాన్ ప్రైజ్ విన్నర్. షారూఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో చేశాడు. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఊహించని ట్విస్టులతో సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే అద్భుతమైన ప్రదర్శన చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ సెన్సేషనల్‌గా ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.

షారూఖ్ ఖాన్ కమ్‌బ్యాక్ అని
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై మరో నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా ట్వీట్ చేశాడు. 'షారూఖ్ ఖాన్‌కు సరైన కమ్‌బ్యాక్ మూవీ. పఠాన్ అనే మూవీ ఎన్నో ట్విస్టులు, భావోద్వేగాలు, దేశ భక్తిని చాటి చెప్పే దృశ్యకావ్యం అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి భారీ విజయాన్ని సాధించే సత్తా ఉంది' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

అలాంటివే.. షారూఖ్ రాకింగ్
'పఠాన్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. దీనికి అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చినట్లే అని చెప్పొచ్చు. అంతేకాదు, ఈ చిత్రం ద్వారా షారూఖ్ ఖాన్ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు చాలా మంది చెబుతున్నారు. అక్కడక్కడా కొన్ని మైనస్‌లు ఉన్నా.. ఈ చిత్రం హిట్ టాక్‌ను తెచ్చుకుంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











