షారుక్ ఖాన్ మూడో కొడుకు ఫస్ట్ లుక్...(ఫోటోస్)
ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సర్రోగసీ పద్దతిలో మూడో సంతానాన్ని పొందిన సంగతి తెలిసిందే. మే 27, 2013లో 13న జన్మించిన ఈ బిడ్డకు అబ్ రామ్ అనే పేరు పెట్టారు. ఎట్టకేలకు షారుక్ ఈ బిడ్డ ఫోటో ఈద్ పండగ సందర్భంగా బయట పెట్టారు.
అయితే ఈ బిడ్డ విషయంలో లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించినట్లు వచ్చిన వార్తలను షారుక్ ఖండించారు.
షారుక్ దంపతులు సర్రోగేట్(అద్దెగర్భం) పద్దతిలో మగబిడ్డను కన్నారని గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చట్ట విరుద్ధంగా తన బిడ్డ పుట్టకముందే బిడ్డ సెక్స్(ఆడా? మగా?) ఏమిటనే విషయాన్ని తెలుసుకున్నారనే వివాదం కూడా అప్పట్లో చెలరేగింది.
బిడ్డ నెలలు నిండక ముందే జన్మించాడని, బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన కారణంగానే తొలుత తానేమీ మాట్లాడలేకపోయానని షారుక్ ఖాన్ స్పష్టం చేసారు. బిడ్డ పుట్టక ముందు తాము ఎలాంటి సెక్స్ డిటర్మేషన్(లింగ నిర్ధారణ) టెస్టులు చేయించలేదని స్పష్టం చేసారు.

కొడుకు అబర్ రామ్ తో షారుక్
కొడుకు అబర్ రామ్ తో షారుక్

ఇద్దరు వారసులతో..
షారుక్ ఖాన్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు ఆర్యన్, కూతురు పేరు సుహానా

కొడుకు ఆర్యన్- కూతురు సుహానాలతో కలిసి...
షారుక్ ఖాన్ తన ఇద్దరు పిల్లతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. తండ్రిలా కాకుండా వారితో స్నేహితుడిలా వ్యవహరిస్తూ ఉంటాడు.

కొడుకు ఆర్యన్‌తో షారుక్ ఖాన్
షారుక్ తనయుడు ఆర్యన్ ప్రస్తుతం లండన్లో చదువుకుంటున్నాడు. ఆర్యన్ ను తన సినీ వారసుడిగా తీర్చి దిద్దుతున్నాడు షారుక్

కూతురు సుహానాతో కలిసి...
తండ్రి షారుక్ తో కలిసి సైకిల్ తొక్కుతూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుహానా

ఇద్దరు పిల్లలతో కలిసి విహార యాత్రలో..
ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి విహార యాత్రలో షారుక్

షారుక్-గౌరీ కలిసి తీసుకున్న నిర్ణయం
సర్రోగేట్ పద్దతిలో బిడ్డను కనాలని షారుక్-గౌరీ కలిసి తీసుకున్న నిర్ణయమే. షారుక్ వీర్యకణాలు, గౌరీ ఖాన్ అండం సేకరించి వాటి ద్వారా వేరొక మహిళ గర్భంలో వీరి బిడ్డ జన్మించడాన్ని సరోగేట్ పద్దతి అంటారు.

గౌరీ ఖాన్ విత్ కింగ్ ఖాన్
షారుక్-గౌరీలది ప్రేమ వివాహం. వీరి పెళ్లి తర్వాత షారుక్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

అన్యోన్య దాంపత్యం...
షారుక్-గౌరీ అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది యువ జంటలకు వీరు ఆదర్శంగా నిలిచారు.


Click it and Unblock the Notifications











