3 గంటల సేపు సాగిన షారుఖ్‌ ఆపరేషన్...

By Srikanya

ముంబయి: బాలీవుడ్‌ సూపర్ స్టాకర్ షారుఖ్‌ఖాన్‌ భుజానికి ఆపరేషన్ జరిగింది. మంగళవారం లీలావతి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేపట్టారు. ఈ ఆపరేషన్ రెండు గంటల నుంచి మూడు గంటలవరకు జరగిందని కుటుంబ సభ్యులు తెలియచేసారు. ప్రస్తుతం షారుఖ్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందనీ ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారనీ తెలియచేసారు.

తీవ్రస్థాయి సాహస కృత్యాల్లో పాల్గొనవద్దని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. లండన్‌లో చదువుకుంటున్న షారుఖ్‌ కుమారుడు ఆర్యన్‌ సమాచారం అందడంతో ముంబయి చేరుకున్నారు. రావన్ షూటింగ్ సమయంలో షారూఖ్ కుడి భుజానికి గాయమైంది.

ప్రస్తుతం షారూఖ్ ..చెన్నై ఎక్సప్రెస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కథలో షారూఖ్ ..ముంబై నుంచి రామేశ్వరం కు వెళ్లే వ్యక్తిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కిది.

దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక..ఎలా చేసినా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X