ఈ సినిమా చూసేటప్పుడు ఫోన్ వాడొద్దంటూ వీడియో విడుదల చేసారు, చూసారా?
‘రయీస్’ సినిమాను థియేటర్లో చూసేటప్పుడు ఫోన్లు వాడకూడదని బాద్‌షా షారుక్ ఖాన్ అన్నారు.
ముంబయి: 'రయీస్' సినిమాను థియేటర్లో చూసేటప్పుడు ఫోన్లు వాడకూడదని బాద్‌షా షారుక్ ఖాన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన 'రయీస్' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులకు షారుక్ ఈ సూచన ఇస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు.
'రయీస్' సాంగ్ టీజర్..
'రయీస్'లోని 'ఓ జాలిమా' అనే పాట టీజర్‌ను షారుక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'పాట వచ్చినా రాకపోయినా.. జాలిమా కోసం పాడక తప్పదు' అని ట్వీట్ చేశారు. బహుశా కథానాయిక మహీరా ఖాన్‌ని ఉద్దేశించి ఈ పాట పాడి ఉంటారు. గురువారం ఈ పాటను పూర్తిగా విడుదల చేస్తున్నారు. రాహుల్ ఢోలకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ సంపత్ స్వరాలు సమకూర్చారు.
ఇక ఇప్పటికే విడుదలైన 'రయీస్' ట్రైలర్ లో షారుక్ బిజినెస్ గురించి చెప్పిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి...హాట్ టాపిక్ గా మారాయి.
ఏ వ్యాపారమైనా మంచి వ్యాపారమే కానీ బిజినెస్‌కి మించిన మతం లేదని రయీస్ చెప్పడం ఆకట్టుకుంటోంది. సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖి పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఇందులో నవాజుద్దీన్ రయీస్‌ని అరెస్ట్ చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలో నవాజుద్దీన్.. 'నువ్వు బిజినెస్ అని దేన్నైతే అంటున్నావో దాన్ని మూసేయ్. లేకపోతే నీ వూపిరినే ఆపేస్తాను' అంటాడు. ఇందుకు షారుక్ 'గుజరాత్‌లో బిజినెస్ గాలిలో ఉంటుంది. నా వూపిరిని ఆపగలరు కానీ గాలిని ఆపలేరు కదా సర్... సదా మీ సేవలో రయీస్' అని షారుక్ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
రాహుల్ ఢోలకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాకిస్థానీ నటి మహీరా ఖాన్ షారుక్‌కి జంటగా నటించింది. రెడ్ చిల్లీస్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గుజరాత్‌కి చెందిన రయీస్ ఆలమ్ అనే మద్యం వ్యాపారి 1980ల్లో గుజరాత్‌లో చేసిన బిజినెస్ గురించి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 2017 జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాహుల్ ఢోలకియా, హరిత్ మెహతా సంయుక్తంగా రాసిన డైలాగులు ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కళ్ళుచెదిరేలా ఉన్నాయి. విశేషం ఏంటంటే.. 50 ఏళ్ల పైబడిన షారుఖ్ ఆ యాక్షన్ సీక్వెన్స్‌లను డూప్స్ లేకుండా చేశాడు.
గుజరాతీ ఫ్లేవర్ ఎక్కువగా నిండిన ఈ ట్రైలర్‌లో మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ తళుక్కుమంది. ఆమె కనిపించినప్పటి నుంచి 'లైలా ఓ లైలా' అనే ఐటెం సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే.. అన్ని ఎలిమెంట్స్‌తో మిక్స్ అయిన ఈ ట్రైలర్ అంచనాలను రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యింది. ఇక 25వ తేదీన ఈ 'రయీస్'ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











