twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో మనసు పారేసుకొంటే.. గవర్నర్ ఎదుటే రేఖ రాఖీ కట్టింది..

    By Rajababu
    |

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మహా చమత్కారి. నటనతోనే కాకుండా మాటలతోనూ ఆకట్టుకొంటారు. ముంబైలో జరిగిన యశ్ చోప్రా అవార్డుల కార్యక్రమంలో షారుక్ మరోసారి తన మాటల చాతుర్యంతో అలరించారు. అవార్డుల ప్రదానంలో భాగంగా తన చేతికి బంగారు బ్రాస్‌లెట్‌ తొడిగిన రేఖను ఉద్దేశించి షారుక్ చిలిపి వ్యాఖ్యలు చేశారు.

     షారుక్‌కు రాఖీ కట్టిన రేఖ

    షారుక్‌కు రాఖీ కట్టిన రేఖ


    ‘రేఖ లాంటి అందమైన నటితో నేను రాఖీ కట్టించుకోవాలనుకోలేదు. కానీ అదే జరిగిందని బంగారు చేతి కంకణాన్ని చూపించారు. ఇది నా జీవితంలో బాధాకరమైన సంఘటన' అని షారుక్ నవ్వేశారు.

     జయప్రద యవ్వనమంతా నీ తలపుల్లోనే..

    జయప్రద యవ్వనమంతా నీ తలపుల్లోనే..


    ఈ కార్యక్రమంలో సీనియర్ నటి జయప్రదను షారుక్ వదల్లేదు. ‘జయప్రదా జీ.. నా యవ్వనమంతా నీ తలపులతోనే నిండిపోయింది. కానీ ఆ విషయం మీతో చెప్పడానికి అవకాశం రాలేదు. ఇప్పుడు చెబుదామంటే ఇక్కడ గవర్నర్‌ గారున్నారు. అందుకే ఇంతకు మించి చెప్పలేను అని షారుక్ చమత్కరించారు.

     బాలీవుడ్ పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది

    బాలీవుడ్ పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది


    ఇలాంటి హుషారెత్తించే మాటలతో అందర్ని ఆహ్లాదపరిచిన షారుక్ ఓ దశలో ఉద్వేగానికి లోనయ్యారు. ‘ఎన్నో ఆశలను మూటగట్టుకొని బాలీవుడ్‌లో ప్రవేశించేనాటికే నా తల్లిదండ్రులను కోల్పోయాను. అప్పుడు నా కంటూ ఓ కుటుంబం లేదు. కానీ బాలీవుడ్ నన్ను అక్కున చేర్చుకొన్నది. గొప్ప నటుడ్ని చేసింది. వంద కోట్లకు పైగా ఉన్న భారత్‌లో నాకు ఓ పెద్ద కుటుంబం దొరికింది' అని షారుక్ అన్నారు. షారుక్‌ను ఆదివారం ముంబైలో యష్‌ చోప్రా స్మారక అవార్డుతో సత్కరించారు.

     పమ్మి అంటీ నాకు తల్లి లాంటిది..

    పమ్మి అంటీ నాకు తల్లి లాంటిది..


    ఈ కార్యక్రమంలో పాల్గొన్న యష్‌ చోప్రా సతీమణి పమేలాతో తనకున్న అనుబంధాన్ని షారుఖ్‌ పంచుకుంటూ ‘పమ్‌ ఆంటీ నాకు తల్లి లాంటిది. నేను ఆమె దగ్గరే పెరిగాను. యష్‌ చోప్రాతో ఎక్కవ చిత్రాల్లో పనిచేసే అదృష్టం నాకు దొరికింది అని అన్నారు. యశ్ చోప్రా సంస్థ యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘డర్‌', ‘దిల్‌ తో పాగల్‌ హై', ‘వీర్‌ జారా', ‘జబ్‌ తక్‌ హై జాన్‌' తదితర చిత్రాల్లో షారుక్ నటించారు.

     షారుక్ ఖాన్ జీవితంపై డాక్యుమెంటరీ

    షారుక్ ఖాన్ జీవితంపై డాక్యుమెంటరీ


    అవార్డు ప్రధాన కార్యక్రమంలో షారుక్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ వేడుకకు మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి, సినీ తారలు రేఖ, జయప్రద, శత్రుఘ్నసిన్హా, పద్మిని కొల్హాపురి తదితరులు హాజరయ్యారు.

    English summary
    Shah Rukh Khan was honoured with the prestigious 4th National Yash Chopra Memorial Award. Actress Rekha and Maharashtra Governor CH Vidyasagar Rao handed the award to superstar Shah Rukh Khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X