twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీషర్ట్ వల్లే అభిమాని మరణం, నివేదిక: షారూఖ్ ఖాన్ అరెస్ట్ కి రంగం సిద్దమౌతోందా??

    కొద్ది రోజుల క్రితం షారూఖ్ చేసిన ప‌ని ఇప్పుడు అరెస్ట్ ముప్పునుఎదుర్కొనేలా చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. చిత్ర ప్ర‌చారంలో భాగంగా టీ ష‌ర్ట్ విసిరిన షారుక్ పెద్ద త‌ప్పు చేశాడని చెబుతున్నారు.

    |

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు ఊహించ‌ని షాక్ ఎదురుకానుందా? షారూఖ్ ని అరెస్ట్ చేసేంత సీరియస్ గా కూడా ఈ పరిణామాలుండవచ్చన్నది కొత్త వార్త. కొద్ది రోజుల క్రితం ఆయ‌న చేసిన ప‌ని ఇప్పుడు అరెస్ట్ ముప్పునుఎదుర్కొనేలా చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. చిత్ర ప్ర‌చారంలో భాగంగా టీ ష‌ర్ట్ విసిరిన షారుక్ పెద్ద త‌ప్పు చేశార‌ని చెబుతున్నారు.

     జనవరి లో రైలు యాత్ర

    జనవరి లో రైలు యాత్ర

    రయీస్‌ సినిమా ప్రచారంలో భాగంగా హీరో షారూఖ్‌ఖాన్‌, ఆ సినిమాలో 'లైలా ఓ లైలా..'పాటలో నర్తించిన సన్నీ లియోన్‌, చిత్రబృందంలోని ఇతరులు జనవరి లో రైలు యాత్ర చేపట్టారు. సెంట్రల్‌ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్‌ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వీరు ప్రయాణించారు. సన్నీ లియోన్‌ బురఖా ధరించి రైలు ఎక్కినట్లు తెలిసింది.

    సన్నీ లియోన్‌

    సన్నీ లియోన్‌

    ఇంజన్‌ మార్పిడి కోసం గుజరాత్‌లోని వడోదర స్టేషన్‌లో రైలును కాసేపు నిలిపారు. అప్పటికే పలు మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన మేరకు భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానుల రూపంలో వచ్చిన ఆకతాయిలకు అడ్డులేకుండాపోయింది. సన్నీ లియోన్‌ కూర్చున్న బోగీని వందలమంది చుట్టుముట్టి నానా హంగామా చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

    షారుక్ టీ ష‌ర్టులు.. బాల్స్ విసిరేయ‌టం వ‌ల్లే

    షారుక్ టీ ష‌ర్టులు.. బాల్స్ విసిరేయ‌టం వ‌ల్లే

    అయితే అదక్కడితో ముగియలేదు షారూఖ్ అభిమానులకోసం అంటూ వారిని ఉత్సాహపరుస్తూ సినిమాకు సంబంధించిన టీషర్టులు, బాల్స్‌ విసిరాడు.షారుక్ చేతుల్లో నుంచి వ‌స్తున్న వ‌స్తువుల్ని అందుకోవాల‌న్న అతృత‌తో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. దీంతో.. ఒక వ్య‌క్తి దుర్మ‌ర‌ణం పాలు కాగా.. ఇద్ద‌రు పోలీసులు స్పృహ కోల్పోయారు. ఇదంతా కూడా షారుక్ టీ ష‌ర్టులు.. బాల్స్ విసిరేయ‌టం వ‌ల్లేన‌ని వ‌డోద‌ర రైల్వే డీఎస్పీ త‌రుణ్ బ‌రోత్ కోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో వెల్ల‌డించారు.

    ఘాటు విమర్శలు

    ఘాటు విమర్శలు

    దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. ప్రైవేటు కార్యక్రమాలకు రైళ్లను, రైల్వే స్టేషన్లను ఎలా ఉపయోగించుకోవడానికి ఇచ్చారని ఘాటు విమర్శలు వచ్చాయి. ఇదంతా కూడా షారుక్ టీ ష‌ర్టులు.. బాల్స్ విసిరేయ‌టం వల్లనే జరిగిందన్న విషయం మరింత సీరియస్ గా కనిపిస్తోంది.

    అరెస్ట్ చేయాల‌ని

    అరెస్ట్ చేయాల‌ని

    ఒక వ్య‌క్తి మ‌ర‌ణానికి.. తొక్కిస‌లాట‌కు షారుకే కార‌ణ‌మ‌ని.. అత‌డ్ని అరెస్ట్ చేయాల‌ని కోర్టును కోరారు. మ‌రి.. పోలీసు అధికారి విన్న‌పానికి కోర్టు ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.కాగా రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు స్పందించారు. వడోదర స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు.

    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌

    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌

    రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయా అన్న అంశంలో కూడా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. అయినా షారూఖ్ విషయం లో ఏం జరుగుతుందన్నది అందరికీ తెల్సిందే... ఎన్ని కేసులు చూడలేదు, ఎందరు అభిమానులు అన్యాయం అయిపోలేదు మనదేశం లో

    English summary
    The report stated that a stampede-like situation was created because Shah Rukh Khan and his team ignored safety and security guidelines, and threw T-shirts and balls towards the people on the platform.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X